MS Dhoni: ధోనీనా..మాజాకా..! పెరిగిన క్యాండీ క్రష్ డౌన్‌లోడ్లు

భారత మాజీ కెప్టెన్, ఐకాన్ క్రికెటర్ ఎం.ఎస్.ధోనీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చిన్నా, పెద్దా తేడా లేకుండా అంతా తనని అభిమానిస్తారు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి 4 ఏళ్ల క్రితం ధోనీ రిటైర్ అయినప్పటికీ తన వ్యక్తిత్వంతో, IPLలో CSK టీంతో అభిమానులని అలరిస్తూనే ఉంటాడు. అయితే ఇటీవల జరిగిన ఓ సంఘటన ధోనీ అభిమానుల మనసుల్ని దోచేసింది.
కుటుంబంతో ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ధోని, ఎయిర్ హోస్టెస్‌తో జరిపిన సంభాషణ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ధోనీ అభిమాని అయిన సదరు ఉద్యోగి ధోనికి ఒక చాకొలేట్స్, డ్రై ఫ్రూట్స్‌తో కూడిన బాక్స్ ఇచ్చింది. అందులోని డేట్స్ మాత్రమే తీసుకుని, ఇతర వాటిని సున్నితంగా తిరస్కరించాడు.
సోషల్ మీడియాలో ఈ వీడియోని చూసిన అభిమానులు తన వ్యక్తిత్వానికి మంత్రముగ్ధులై స్పందించారు. "ధోనీ బంగారం.." అంటూ ఓ యూజర్ కామెంట్ చేశాడు.
ధోనీ- క్యాండీ క్రష్..
ఫ్లైట్‌లో ధోనీ తన ట్యాబ్‌లో పాపులర్ గేమ్ క్యాండీ క్రష్ ఆడుతూ కనిపించాడు. ఈ విషయాన్ని గుర్తించిన అభిమానులు వివిధ రకాలుగా స్పందించారు.
"ఎన్నో లెవెల్‌లో ఆడుతున్నాయి ధోనీ అన్నా..." అంటూ ఓ యూజర్ అడిగాడు.
"ధోనీ అన్నా, నువ్వు కూడా క్యాండీ క్రష్ ఆడతావా, హ..హ" అని తన ఆనందం వ్యక్తం చేశాడు.
ధోని దెబ్బకి క్యాండీ క్రష్ అప్లికేషన్‌ని 3 గంటల్లోనే ౩౦ లక్షలకు పైగా డౌన్‌లోడ్లు చేసుకున్నారని కంపెనీ తెలిపింది. క్యాండీక్రష్ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ధోనీకి కృతజ్ణతలు తెలిపింది.
అయితే ఐపీల్ సాధించిన తర్వాత ధోనీ 5వ సారి మోకాలి శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ఈ సంవత్సరం ట్రోఫీని సాధించిపెట్టాడు. ఈ ఐపీఎల్‌లో 12 ఇన్నింగ్స్‌ల్లో 182 స్ట్రైక్‌రేట్‌తో 104 పరుగులు చేశాడు.
ధోనీ ఈ IPLతో రిటైర్మెంట్ ప్రకటిస్తాడన్న ఊహాగానాల నేపథ్యంలో అభిమానుల్ని అలరించడానికి నేను వచ్చే ఐపీఎల్ కూడా ఆడతానని చెప్పి అభిమానుల్ని ఆనందంలో ముంచెత్తాడు.
"IPLకి రిటైర్మెంట్ ప్రకటించడానికి ఇది సరైన సమయమే. కానీ అభిమానులు నామీద చూయిస్తున్న ఈ ప్రేమకి నేను ఏదో ఒకటి చేయాలి. వచ్చే ఐపీఎల్ సీజన్ కూడా ఆడి అభిమానులకి బహుమానం ఇస్తాను" అని ఫైనల్ తర్వాత స్పష్టం చేశాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com