MS DHONI: మహేంద్రుడి మాయాజలం లేకపోతే గెలవలేదా?

ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభంలోనే చెన్నైకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఎన్నో విజయాలతో చరిత్ర సృష్టించిన ఈ జట్టు, ఈసారి తొలి రెండు మ్యాచుల్లో ఘోర పరాజయాన్ని చవిచూడటం అభిమానులను నిరాశకు గురిచేసింది. ముఖ్యంగా జట్టుకు ఎన్నో సంవత్సరాలుగా బలంగా నిలిచిన కెప్టెన్ ఎంఎంస్ ధోనీ గైర్హాజరీ ఈ మ్యాచ్‌లో స్పష్టంగా కనిపించింది. గాయం కారణంగా ధోని ఇంకా కోలుకుంటుండటంతో ఆయన లేకుండానే బరిలోకి దిగిన చెన్నై జట్టు, రాజస్థాన్, రాయల్ ఛాలేంజర్స్ బెంగళూరు చేతిలో పూర్తిగా తేలిపోయింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు ఆరంభం నుంచే కష్టాల్లో పడింది. రాజస్థాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో చెన్నై బ్యాటర్లు ఒక్కరైనా నిలదొక్కుకోలేకపోయారు. కీలక ఆటగాళ్లుగా భావించిన రుతురాజ్ గైక్వాడ్ వంటి వారు ఆశించిన ప్రదర్శన ఇవ్వలేకపోయారు. ఫలితంగా చెన్నై జట్టు 19.4 ఓవర్లలో కేవలం 127 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక బెంగళూరుతో జరిగిన మ్యాచులో చెన్నై బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. బౌలింగ్‌లో వ్యూహాలు అమలు చేయలేకో పూర్తిగా చతికిలపడ్డారు.
మరీ ఇంత బలహీనమా..
చిన్న లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్ మాత్రం ఎక్కడా ఒత్తిడికి లోనవ్వలేదు. యువ ఆటగాళ్లు యశస్వీ వైభవ్ సూర్యవంశీ దూకుడుగా ఆడుతూ చెన్నై బౌలర్లపై ఆధిపత్యం చాటారు. కేవలం 13 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుని, 8 వికెట్ల తేడాతో విజయం సాధించారు. ఈ విజయం ఎంత సులభంగా సాధించారో చూస్తే చెన్నై బౌలింగ్ ఎంత బలహీనంగా మారిందో అర్థమవుతుంది. ఈ పరాజయం చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ఓటముల్లో ఒకటిగా నమోదైంది. ముఖ్యంగా మిగిలిన బంతుల పరంగా చూస్తే, గతంలో కోల్ కత్తా చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ఇదే రెండో అతిపెద్ద పరాజయంగా నిలిచింది.
జట్టులో అనుభవజ్ఞుడైన ధోని లేకపోవడం ఎంత పెద్ద లోటో ఈ మ్యాచ్ స్పష్టంగా చూపించింది. మ్యాచ్ పరిస్థితులను అంచనా వేసి జట్టును సమతూకంగా నడిపించే నాయకత్వం లేకపోవడం, ఒత్తిడిని ఎదుర్కొనే సామర్థ్యం తగ్గిపోవడం వంటి అంశాలు స్పష్టంగా బయటపడ్డాయి. సోషల్ మీడియాలో అభిమానులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, ధోని లేకపోవడమే ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడుతున్నారు. అయితే టోర్నీ ఇప్పుడే ప్రారంభమైందని, ఒకే మ్యాచ్ ఆధారంగా జట్టును అంచనా వేయడం సరికాదని విశ్లేషకులు సూచిస్తున్నారు. ముందున్న మ్యాచ్‌ల్లో చెన్నై జట్టు తప్పిదాలను సరిదిద్దుకుని తిరిగి బలంగా రాణించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అభిమానులు కూడా తమ జట్టు త్వరగా పుంజుకుని విజయం సాధించాలని ఆశిస్తున్నారు. మ్యాచ్ చెన్నై కు గట్టి హెచ్చరికగా నిలిచింది. ముఖ్యంగా జట్టులో నాయకత్వం, అనుభవం ఎంత కీలకమో మరోసారి రుజువైంది. ధోని మళ్లీ జట్టులో చేరిన తర్వాత చెన్నై ఎలా పుంజుకుంటుందో అన్నది ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మ్యాచ్ అనంతరం రుతురాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మ్యాచ్ ఓటమి మాకు పెద్దగా నిరాశ కలిగించలేదు. అయితే మా ఇన్నింగ్స్ ఆరంభంలో రాజస్థాన్ రాయల్స్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, నండ్రీ బర్గర్లు బౌలింగ్ చేస్తున్నప్పుడు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనిపించింది. రాజస్థాన్ బౌలర్లు లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేశారు. ఇన్నింగ్స్ ఆరంభంలో పేసర్లు, మధ్యలో స్పిన్నర్లకు పిచ్ సహకరించినట్లు అనిపించింది. వరుస ఓటములతో చెన్నై అభిమానులు నిరాశలో ఉన్నారు. ధోనీ వస్తేనే చెన్నై విజయాల బాట పట్టే అవకాశం ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
