ఇంట్లో 24 పతకాలు.. రోడ్డు మీద చిప్ప్ అమ్ముకుంటున్న పారా షూటర్..

కూటికి, గుడ్డకి కొరగాని ఆ ఆటలెందుకని అమ్మ అరిచినా ఆట మీద ఇష్టంతో అమ్మకి చెప్పకుండా చదువుకుంటూనే ఆటల్లో రాణించింది.. అంతర్జాతీయ క్రీడాకారిణిగా ఎదిగింది. కానీ పరిస్థితులు తారుమారై ఆమె ఇప్పుడు రోడ్డు మీద చిప్స్ పాకెట్లు, బిస్కట్లు అమ్ముకుని జీవనం సాగిస్తోంది.
34 ఏళ్ల దిల్‌రాజ్ కౌర్ భారతదేశం నుండి వచ్చిన మొదటి అంతర్జాతీయ పారా షూటింగ్ స్టార్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఆమె తన కెరీర్‌లో రెండు డజనులకు పైగా జాతీయ, అంతర్జాతీయ టైటిళ్లు గెలుచుకున్నారు.
స్పోర్ట్స్ కోటాపై ప్రభుత్వ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నా కానీ ప్రభుత్వం నుంచి స్పందన లేదని ఆమె అన్నారు. ఉత్తరాఖండ్ పారా పారా షూటింగ్ సంఘం నుంచి తనకు ఎలాంటి సహాయం అందలేదని దిల్‌రాజ్ అన్నారు.
దిల్‌రాజ్ కౌర్ భారతదేశపు మొదటి అంతర్జాతీయ స్థాయి పారా షూటర్లలో ఒకరిగా గుర్తింపు పొందారు. దిల్‌రాజ్ ఇప్పుడు డెహ్రాడూన్‌లోని గాంధీ పార్కు సమీపంలో రోడ్డు పక్కన కూర్చుని బిస్కెట్లు, చిప్స్ విక్రయిస్తున్నారు. "నేను క్రీడల్లో పతకాలు గెలిచినందున నా జీవితం బావుంటుందని అనుకున్నాను. కాని అలా జరగలేదు అని కౌర్ అన్నారు.
ఒకప్పుడు దేశంలోని ఉత్తమ పారా ఎయిర్ పిస్టల్ షూటర్లలో ఒకరిగా రాణించిన దిల్‌రాజ్ తన కెరీర్‌లో రెండు డజన్ల జాతీయ మరియు అంతర్జాతీయ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆమె తన తల్లి గుర్బీత్‌తో కలిసి డెహ్రాడూన్‌లోని అద్దె ఇంట్లో నివసిస్తోంది. "మా ఆర్థిక స్థితి చాలా ఘోరంగా ఉంది. అందుకే ఇలా బిస్కట్లు, చిప్స్ అమ్ముతున్నాను అని ఆమె ఆవేదనగా చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com