Wimbledon: వీనస్ విలియమ్స్ ఇంటికి, జకోవిచ్ ముందుకు

Wimbledon: వీనస్ విలియమ్స్ ఇంటికి, జకోవిచ్ ముందుకు

ప్రతిష్ఠాత్మక వింబుల్డన్ టోర్నీ సోమవారం ఆరంభమైంది. తొలి రౌండ్‌లో పలువురు టాప్ సీడ్ క్రీడాకారులు, క్రీడాకారిణులు తమ విభాగాల్లో పోటీపడి తదుపరి రౌండ్‌కి అర్హత సాధించారు. అయితే తొలిరోజు ఆటలో సంచలనాలేమీ నమోదు కాలేదు. డిఫెండింగ్ ఛాంపియన్, సెర్బియన్ ఆటగాడు నొవాక్ జకోవిచ్, మహిళల నంబర్ వన్ క్రీడాకారిణి ఇగా స్వైతక్‌లు 2వ రౌండ్‌కి ముందుకు వెళ్లారు.వర్షం గంటపాటు ఆటంకం కలిగినించినప్పటీకీ మ్యాచ్‌లు మళ్లీ మొదలయ్యాయి. మొదటి రౌండ్‌లో విజయం సాధించిన వారిలో 4వ సీడ్ క్రీడాకారిణి జెస్సికా పెగులా, 3 సార్లు ఫైనలిస్ట్ క్యాస్పర్ రడ్, టాప్ క్రీడాకారులు విక్టోరియా అజరెంకా, ఆండ్రూ రుబ్లెవ్‌లు కూడా ఉన్నారు.


5 సార్లు వింబుల్డన్ విజేత అయిన అమెరికా క్రీడాకారిణి వీనస్ విలియమ్స్ తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడం సంచలనంగా చెప్పవచ్చు. అయితే ఆట తొలి సెట్‌లో ఆడుతుండగా జారి కిందపడిపోయి బాధతో విలవిల్లాడింది. కొద్దిసేపు తర్వాత ఆడినప్పటికీ 6-4, 6-3 వరుస సెట్లలో ఉక్రెయిన్‌కి చెందిన ఎలీనా స్విత్లోనా చేతిలో ఓడిపోయి 6వ టైటిల్ కొట్టాలన్న ఆశలు ఆవిరయ్యాయి.

పురుషుల వరల్డ్ నంబర్ 2 ఆటగాడు నొవాక్ జకోవిచ్‌కి కూడా తొలి రౌండ్‌లో సులువుగానే విజయం సాధించాడు. అర్జెంటీనా ఆటగాడు పెడ్రో కాచిన్‌ని 6-3, 6-3, 7-6(4)తో ఓడించి రెండవ రౌండ్‌లో ప్రవేశించాడు. ఈ విజయంతో వింబుల్డన్‌లో వరుసగా 18 సార్లు మొదటి రౌండ్ గెలిచిన ఆటగాడిగా నిలిచాడు. వింబుల్డన్‌ టోర్నీలో జకోవిచ్‌కి ఇది 29వ వరుస విజయం. 2017 సంవత్సరం నుంచి ఒక్క వింబుల్డన్ మ్యాచ్‌ కూడా అతను ఓడిపోలేదు. గత 5 సంవత్సరాలుగా వింబుల్డన్ విజేత జకోవిచే.

మహిళల సింగిల్స్‌లో వరల్డ్ నంబర్ 1, టాప్ సీడ్, పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వైతెక్, చైనా క్రీడాకారిణి ఝూ లిన్‌ని 6-1, 6-3 సెట్లలో విజయం సాధించింది.

వరల్డ్ నంబర్ ర్యాంకర్, టాప్ సీడ్‌, స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కజార్ తొలి రౌండ్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. ఫ్రాన్స్‌కి చెందిన చార్డీతో తలపడనున్నాడు.

Tags

Read MoreRead Less
Next Story