Wimbledon: సెమీస్ చేరిన జకోవిచ్

Wimbledon: సెమీస్ చేరిన జకోవిచ్

పురుషుల టెన్నిస్‌లో సెర్బియన్ టెన్నిస్ ఆటగాడు, వరల్డ్ నంబర్ 2 నొవాక్ జకోవిచ్ వింబుల్డన్ టోర్నీలో సెమీస్‌కి దూసుకెళ్లాడు. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్యా ఆటగాడు ఆండ్రూ రెబ్లెవ్‌ను 4-6, 6-1, 6-4, 6-3 తేడాతో ఓడించాడు. మొదటి సెట్‌ని గెలిచి ఫామ్‌లో కనిపించిన రుబ్లెవ్, తరువాత సెట్లలో జకోవిచ్ ఆటకి తలొగ్గాడు.

ఈ విజయంతో 46వ సారి మేజర్ టైటిళ్ల టోర్నీల్లో సెమీ ఫైనల్‌కు చేరిన ఆటగాళ్లలో రోజర్ పెదెరర్ రికార్డును సమం చేశాడు. వరుసగా 5వ సారి కూడా వింబుల్డన్ గెలవాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఈ వింబుల్డన్ గెలిస్తే మళ్లీ నంబర్ 1 స్థానానికి చేరుకుంటాడు.


మరోవైపు తన కెరీర్‌లో 8వ గ్రాండ్ గ్రాండ్ స్లామ్ ఆడుతున్న రుబ్లెవ్ ఒక్కసారి కూడా సెమీస్‌కు చేరుకోలేకపోయాడు. ప్రస్తుత కాల ఆటగాళ్లలో సెమీఫైనల్ చేరడానికి ఇన్ని క్వార్టర్స్ ఏ ఆటగాడూ ఆడలేదు. ఇంతకుముందు ఆస్ట్రేలియన్ ఓపెన్‌ క్వార్టర్స్‌లో కూడా జకోవిచ్ చేతిలోనే ఇంటిముఖం పట్టాడు.

మరో క్వార్టర్స్‌లో గెలిచి 21 యేళ్ల జన్నిక్ సిన్నర్‌ కూడా తన మొదటి సెమీస్‌కి చేరుకున్నాడు. రోమన్ సాఫిలున్‌ని 6-4, 3-6, 6-2, 6-2 తేడాతో ఓడించాడు. ఇటలీ నుంచి సెమీస్ చేరిన మూడో ఆటగాడిగా నిలిచాడు.

సెమీస్‌లో జన్నిక్ సిన్నర్, నొవాక్ జకోవిచ్‌లు తలపడనున్నారు. పురుషుల నంబర్ 1 ర్యాంకర్ కార్లోస్ అల్కరాజ్ నేడు రూన్‌తో క్వార్టర్స్‌లో తలపడనున్నాడు.


Tags

Read MoreRead Less
Next Story