DK: రికీ పాంటింగ్‌కి గతాన్ని గుర్తు చేసిన దినేష్ కార్తీక్

DK: రికీ పాంటింగ్‌కి గతాన్ని గుర్తు చేసిన దినేష్ కార్తీక్
"వచ్చే సంవత్సరం కామెంటేటర్‌గా కాంట్రాక్ట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లున్నాడు కదా..? బాగా చెప్పావు డీకే" అంటూ పాంటింగ్ సరదాగా స్పందించాడు.

క్రికెటర్, కామెంటేటర్ దినేష్ కార్తీక్ తన ఛలోక్తితో కూడిన మాటలతో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్లకు వారికి గత యాషెస్ చేదు జ్ణాపకాలను గుర్తుకు చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న యాషెస్ టెస్ట్ సిరీస్ చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా జట్టు లక్ష్యఛేదనలో విజయం వైపు ధాటిగా ఆడుతూ వెళ్తోంది. ఈ క్రమంలో కామెంటేటర్లుగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్క్ టేలర్, రికీ పాంటింగ్‌లు దినేష్ కార్తీక్‌తో సంభాషణ జరిపారు. ఆస్ట్రేలియా జట్టు చాలా బాగా ఆడుతున్నట్లుగా కామెంటేటర్లు మాట్లాడుతుండగా, వారికి 2009 లో జరిగిన యాషెస్ మ్యాచ్‌ని గుర్తుకు చేసి ఆటపట్టించాడు.

"ఈ ఇద్దరు కామెంటేటర్లు ఆస్ట్రేలియా చాలా బాగా ఆడుతోందని గోలచేస్తున్నారు. మీకు ఒక విషయం గుర్తుచేస్తా. 2009 సంవత్సరంలో యాషెస్ సిరీస్‌లో ఇదే రికీ పాంటింగ్, మైక్ హస్సీలు ఆస్ట్రేలియా గెలుపు కోసం 127 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి విజయం వైపు వెళ్తున్నారు. అంతలో పాంటింగ్‌ రనౌట్ అయ్యాడు. ఆ తర్వాత ఆసీస్ మ్యాచ్ ఓడిపోయింది. తదనంతరం యాషెస్ సిరీస్ కూడా" అని వ్యంగ్యంగా వారికి గుర్తుకు చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా నవ్వుతూ కనిపించారు.

"వచ్చే సంవత్సరం కామెంటేటర్‌గా కాంట్రాక్ట్‌ కోసం ప్రయత్నిస్తున్నట్లున్నాడు కదా..? బాగా చెప్పావు డీకే" అంటూ పాంటింగ్ సరదాగా స్పందించాడు.

2009లో జరిగిన ఆ టెస్ట్ మ్యాచ్‌లో 546 పరుగుల కష్ట సాధ్యమైన భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో రికీ పాంటింగ్, మైక్ హస్సీల జంట239 బంతుల్లో 127 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. అయితే ఆండ్రూ ఫ్లింటాఫ్ డైరెక్ట్ త్రో ద్వారా 66 పరుగులు చేసిన పాంటింగ్‌ని రనౌట్‌గా వెనక్కి పంపాడు. అదే మ్యాచ్‌ గతిని మార్చేసింది. ఆస్ట్రేలియా 348 పరుగులకు ఆలౌటయింది. 197 పరుగులతో మ్యాచ్‌ ఓడటంతో పాటు 2-1 తేడాతో సిరీస్‌ కూడా కోల్పోయింది.

Tags

Read MoreRead Less
Next Story