Virat Kohli: ప్లీజ్.. నన్ను అలా పిలవకండి

మరో రెండు రోజుల్లో ఐపీఎల్-2024 టోర్నీకి తెరలేవనుంది. అయితే, ఐపీఎల్ 17వ సీజన్ ప్రారంభానికి ముందు బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ (ఆర్‌సీబీ) మంగళవారం రాత్రి బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ అన్‌బాక్స్ పేరిట ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ఆర్‌సీబీ అభిమానులు వచ్చారు. ఇక విరాట్ కోహ్లీ బెంగళూరు జట్టుకు ఐపీఎల్ టోర్నీ మొదటి సీజన్ (2008) నుంచి ఆడుతున్నాడు. దీంతో ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఆయనను 'కింగ్ కోహ్లీ' అని ముద్దుగా పిలుస్తుంటారు. అయితే, ఈ కార్యక్రమంలో విరాట్ కోహ్లీ ఇదే విషయమై హోస్ట్ దానీష్ సేత్‌తో పాటు అభిమానులకు స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.
ఇక ఈ కార్యక్రమంలో ఇటీవల డబ్ల్యూపీఎల్ ట్రోఫీ గెలిచిన ఆర్‌సీబీ మహిళా జట్టును బెంగళూరు యాజమాన్యం ఘనంగా సత్కరించింది. డబ్ల్యూపీఎల్ రెండో సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి బెంగళూరు టైటిల్ కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్‌సీబీ అభిమానులు 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించి తమ కోరికను నెరవేర్చారని సంబర పడిపోతున్నారు. ఈ విషయమై కూడా కోహ్లీ మాట్లాడాడు. "ఆర్‌సీబీ మహిళలు డబ్ల్యూపీఎల్ టైటిల్ గెలవడం నిజంగా అద్భుతం. మేము కూడా ఈసారి ఐపీఎల్‌లో విజయం సాధించి ట్రోఫీలను డబుల్ చేస్తే, అది కచ్చితంగా ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది" అని చెప్పుకొచ్చాడు.
ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (Indian Premier League)లో తొలి మ్యాచ్‌లోనే కొదమ సింహాల పోరు జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. ధోనీ, కోహ్లీ మధ్య జరిగే ఈ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా.. ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. చెన్నై చెపాక్ స్టేడియంలో కోహ్లీ టీం- ధోనీ టీం ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచులు ఆడగా కేవలం ఒక్క మ్యాచ్‌లో మాత్రమే బెంగళూరు గెలుపొందింది. ఇక్కడ మొత్తం ధోనీ జట్టు మానియానే నడుస్తుంది. మైదానమంతా పసుపుమయంగా మారుతుంది. 2008లో మాత్రమే బెంగళూరు.. చెన్నైని ఓడించింది. ఆ తర్వాత జరిగిన ఏడు మ్యాచుల్లోనూ చెన్నైపై ఆర్సీబీ గెలవలేదు. ఈ రికార్డే ఆర్సీబీ అభిమానులను సీజన్ ప్రారంభానికి ముందు కలవరపెడుతుంది. అయితే ఈ మ్యాచ్‌కు సంబంధించిన టికెట్లన్నీ హాట్ కేకుల్లా అయిపోవడంతో... అన్నా... ఒక్క టికెట్ ప్లీజ్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో వేడుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com