Wimbledon: వింబుల్డన్‌లో సంచలనం, నం. 1ని ఓడించిన 76 వ ర్యాంకర్

వింబుల్డన్‌లో సంచలనం నమోదైంది. 76వ ర్యాంకర్ క్రీడాకారిణి, ఉక్రెయిన్‌కి చెందిన ఎలీనా స్విత్లోనా, నంబర్ 1 ర్యాంకర్ ఇగా స్వైతక్‌ని ఓడించింది. క్వార్టర్ట్ ఫైనల్లో వీరిద్దరూ తలపడిన మ్యాచ్‌లో 7-5, 6-7 (5/7), 6-2 తేడాతో టాప్ సీడ్‌పై నెగ్గి సంచలనం సృష్టించింది. బిడ్డకు జన్మనిచ్చిన 3 నెలల ప్రసూతి సెలవుల అనంతరం ఆడటం ప్రారంభించిన ఎలీనా, ఇప్పుడు ఈ టోర్నీలో సెమీస్‌కి చేరడం విశేషం. 2019 వింబుల్డన్ సెమీస్‌లో ఆడిన ఎలీనా, సెమీ ఫైనల్లో చెక్ రిపబ్లిక్ క్రీడాకారిణితో తలపడనుంది.
A five-star performance 🌟@ElinaSvitolina defeats the world No.1 Iga Swiatek 7-5, 6-7(5), 6-2 to reach the semi-finals at #Wimbledon once again pic.twitter.com/l6nUu17KHj
— Wimbledon (@Wimbledon) July 11, 2023
మొదటి రౌండ్లో 4-2తో వెనకబడిన ఎలీనా తన పోరాట పటిమతో వరుస పాయింట్లు, ప్రత్యర్థి తప్పిదాలతో ఆ సెట్‌ని 7-6 తేడాతో గెలుచుకుని వరల్డ్ నంబర్ 1ని ఒత్తిడిలోకి నెట్టింది. హోరాహోరీగా సాగిన రెండవ సెట్ 6-6తో సమం అవగా టై బ్రేకర్లో స్వైతక్ పాయింట్ సాధించి సెట్ నెగ్గింది.
నిర్ణయాత్మక 3వ సెట్‌లో ఎలీనా తన ప్రతాపం చూపింది. బ్రేక్ పాయింట్లు సాధిస్తూ సెట్‌లో తిరుగులేని 5-1 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. ప్రత్యర్థి బాల్‌ని నెట్‌కి తగలడంతో పాయింట్ గెలివడంతో విజయం ఆమె సొంతమైంది. మ్యాచ్‌లో స్వైతక్ 41 తప్పిదాలు చేయడం కూడా ఆమెకి కలిసొచ్చింది.
సెమీస్ చేరే క్రమంలో వీనస్ విలియమ్స్, సోఫియా, విక్టోరియా అజరెంకా, స్వైతక్ వంటి టాప్ క్రీడాకారిణులను ఓడించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com