ENG vs IND: విజయానికి ఏడు వికెట్ల దూరంలో...

ENG vs IND: విజయానికి ఏడు వికెట్ల దూరంలో...
X
427 పరుగులకు భారత్ డిక్లేర్... ఇంగ్లాండ్‌ ముందు 608 పరుగుల టార్గెట్‌... 72 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌

రెం­డో­టె­స్టు­ను కై­వ­‌­సం చే­సు­కు­నేం­దు­కు ఇం­డి­యా రంగం సి­ద్ధం చే­సు­కుం­ది. ప్ర­‌­త్య­‌­ర్థి­కి భారీ టా­ర్గె­ట్ ను సెట్ చే­సిన టీ­మిం­డి­యా.. ఇప్ప­‌­టి­కే మూడు వి­కె­ట్లు తీసి, ఐదో రోజు వి­జ­‌­యం సా­ధిం­చా­ల­‌­ని టీ­మిం­డి­యా పట్టు­ద­ల­గా ఉంది. రెం­డో ఇన్నిం­గ్స్‌­లో 427/6 స్కో­రు చేసి డి­క్లే­ర్ చే­సిం­ది భారత జట్టు. దీం­తో 608 పరు­గుల భారీ లక్ష్య­ఛే­ద­న­తో బ్యా­టిం­గ్ మొ­ద­లె­ట్టిన ఇం­గ్లాం­డ్ జట్టు, నా­లు­గో రోజు ఆట ము­గి­సే సమ­యా­ని­కి 3 వి­కె­ట్లు కో­ల్పో­యి 72 పరు­గు­లు చే­సిం­ది. భారత జట్టు వి­ధిం­చిన లక్ష్యా­ని­కి ఇంకా 536 పరు­గు­లు వె­న­క­బ­డి ఉంది ఇం­గ్లాం­డ్.. ఐదో రోజు వర్షం కు­రి­సే అవ­కా­శం ఉం­డ­డం­తో బౌ­ల­ర్ల పర్ఫా­మె­న్స్‌­పై­నే టీ­మిం­డి­యా అవ­కా­శా­లు ఆధా­ర­ప­డి ఉన్నా­యి.

భారీ స్కోరు చేసిన టీమిండియా

తొలి ఇన్నిం­గ్స్‌­లో డబు­ల్ సెం­చ­రీ (269) చే­సిన కె­ప్టె­న్ శు­భ్‌­మ­న్ గిల్ (161; 162 బం­తు­ల్లో 13 ఫో­ర్లు, 8 సి­క్స్‌­లు) సె­కం­డ్ ఇన్నిం­గ్స్‌­లో­నూ చె­ల­రే­గా­డు. రి­ష­భ్‌ పంత్ (65; 58 బం­తు­ల్లో 8 ఫో­ర్లు, 3 సి­క్స్‌­లు) క్రీ­జు­లో ఉన్నం­త­సే­పు అల­రిం­చా­డు. రవీం­ద్ర జడే­జా (69*; 118 బం­తు­ల్లో), కే­ఎ­ల్ రా­హు­ల్ (55; 84 బం­తు­ల్లో 10 ఫో­ర్లు) కూడా అర్ధ శత­కా­లు బా­దా­రు. వా­షిం­గ్ట­న్ సుం­ద­ర్ (12*) పరు­గు­లు చే­శా­డు. ఇం­గ్లాం­డ్ బౌ­ల­ర్ల­లో జోష్ టంగ్ 2, షో­య­బ్ బషీ­ర్ 2, బ్రై­డ­న్ కా­ర్స్, రూట్ చెరో వి­కె­ట్ పడ­గొ­ట్టా­రు. తొలి ఇన్నిం­గ్స్‌­లో భా­ర­త్ 587 పరు­గు­లు చే­య­గా.. ఇం­గ్లాం­డ్ 407 పరు­గు­ల­కు ఆలౌ­టైన సం­గ­తి తె­లి­సిం­దే. రెం­డో ఇన్నిం­గ్స్‌­లో 64/1తో నా­లు­గో రోజు ఆటను ఆరం­భిం­చిన భా­ర­త్ 427/6 వద్ద డి­క్లే­ర్ చే­సిం­ది. ఈ క్ర­మం­లో తొలి ఇన్నిం­గ్స్ ఆధి­క్యం 180 కలు­పు­కొ­ని 608 పరు­గుల భారీ టా­ర్గె­ట్‌­ని ఇం­గ్లాం­డ్‌ ముం­దు ఉం­చిం­ది.

ఆకాశ్ దీప్ హ‌వా..

608 ప‌­రు­గుల టా­ర్గె­ట్ తో బ‌­రి­లో­కి ది­గిన ఇం­గ్లాం­డ్ ను ఆకా­శ్ దీప్ వ‌­ణి­కిం­చా­డు. మంచి యాం­గి­ల్స్ తో బౌ­లిం­గ్ చేసి, రెం­డు కీ­ల­‌క వి­కె­ట్ల­‌­ను కొ­ల్ల­‌­గొ­ట్టా­డు. అం­త­‌­కు­ముం­దు హై­ద­‌­రా­బా­దీ పే­స­‌­ర్ మ‌­హ్మ­‌­ద్ సి­రా­జ్ ఇం­గ్లాం­డ్ ప‌­త­‌­నా­ని­కి నాం­ది ప‌­లి­కా­డు. త‌న తొలి ఓవ­‌­ర్లో­నే ఓపె­న­‌­ర్ జాక్ క్రా­లీ ని డ‌­కౌ­ట్ చే­శా­డు. మంచి లెం­గ్త్ లో బౌ­లిం­గ్ చే­య­‌­గా, డ్రై­వ్ ఆడిన క్రా­లీ ఔట­‌­య్యా­డు. ఆ త‌­ర్వాత ఆకా­శ్ దీప్ హ‌వా మొ­ద­‌­లైం­ది. తొలి ఇన్నిం­గ్స్ మా­ది­రి­గా­నే బెన్ డ‌­కె­ట్ (25)ను త‌నే ఔట్ చే­శా­డు. ఓవ­‌­ర్ ద వి­కె­ట్ బౌ­లిం­గ్ చేసి, డ‌­కె­ట్ ను క్లీ­న్ బౌ­ల్డ్ చే­శా­డు. ఆ త‌­ర్వాత మ‌­రింత చ‌­క్క­‌­గా బౌ­లిం­గ్ చే­స్తూ, ప్ర­‌­మా­ద­‌­క­‌ర జో రూట్ (6) ని క్లీ­న్ బౌ­ల్డ్ చే­శా­డు. ఆ త‌­ర్వాత ఒల్లీ పోప్, హేరీ బ్రూ­క్ మ‌రో వి­కె­ట్ ప‌­డ­‌­కుం­డా రో­జు­ను ము­గిం­చా­రు. అం­త­‌­కు­మం­దు ఓవ­‌­ర్ నైట్ స్కో­రు 64/1 తో రెం­డో ఇన్నిం­గ్స్ ను కొ­న­‌­సా­గిం­చిన టీ­మిం­డి­యా.. గిల్ (161) మ‌­రో­సా­రి సెం­చ­‌­రీ­తో స‌­త్తా చా­టా­డు. తొలి ఇన్నిం­గ్స్ లో డ‌­బు­ల్ సెం­చ­‌­రీ, రెం­డో ఇన్నిం­గ్స్ లో సెం­చ­‌­రీ చే­సిన రెం­డో భా­ర­‌త ప్లే­య­‌­ర్ గా ని­లి­చా­డు. నేడు ఆట­‌­కు చి­వ­‌­రి రోజు కా­వ­‌­డం­తో మి­గ­‌­తా వి­కె­ట్ల­‌­ను తీసి, రెం­డో టె­స్టు­ను కై­వ­‌­సం చే­సు­కో­వా­ల­‌­ని భా­ర­‌­త్ భా­వి­స్తోం­ది. దీం­తో ఐదు టె­స్టుల సి­రీ­స్ ను 1-1తో స‌మం చే­యా­ల­‌­ని భా­వి­స్తోం­ది. అం­త­‌­కు­ముం­దు తొలి టె­స్టు­ను ఇం­గ్లాం­డ్ గె­లు­చు­కు­న్న సం­గ­‌­తి తె­లి­సిం­దే.

Tags

Next Story