Womens Ashes: టీ20 సిరీస్ ఇంగ్లాండ్‌దే, అయినా ముందంజలో ఆస్ట్రేలియా

Womens Ashes: టీ20 సిరీస్ ఇంగ్లాండ్‌దే, అయినా ముందంజలో ఆస్ట్రేలియా

మహిళల యాషెస్ టోర్నీలో భాగంగా జరిగిన 3వ టీ20లో ఆస్ట్రేలియా జట్టుపై, ఇంగ్లాండ్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్ క్రీడాకారిణి 23 బంతుల్లో 46 పరుగులు చేసి కీలకపాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచింది. సిరీస్‌లో రాణించిన మరో ఇంగ్లాండ్ క్రీడాకారిణి డానీ వాట్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. ఈ విజయంతో టీ20 సిరీస్‌ని ఇంగ్లాండ్ గెలిచినట్లయింది. అయితే వన్డేలు, టీ20, టెస్టు మ్యాచులతో మల్టీ ఫార్మాట్‌లో జరుగుతున్న ఈ యాషెస్ సిరీస్‌లో ఆస్ట్రేలియా జట్టు 6-4 మ్యాచుల విజయాల తేడాతో ముందుంది. యాషెస్ ఇంగ్లాండ్ వశం కావాలంటే 3 వన్డేల సిరీస్‌ని క్లీన్‌స్వీప్ చేయాల్సి ఉంది.


వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో 14 ఓవర్లలో 119 పరుగుల లక్ష్య ఛేదనతో ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ ఆరంభించింది. ఓపెనర్ డానీ వాట్ వరుస బౌండరీలతో 15 బంతుల్లో 26 పరుగులతో శుభారంభాన్నందించింది. 4 ఓవర్ల పవర్‌ప్లే ముగిసేసరికి ఇంగ్లాండ్ డానీ వికెట్ కోల్పోయి 39 పరుగులు చేసింది. మరుసటి ఓవర్లో మొదటి బంతికే మరో ఓపెనర్ డంక్లీ కూడా పెవిలియన్ బాట పట్టడంతో ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. అనంతరం క్రీజులోకి వచ్చిన అలెక్స్ క్యాప్సీ, స్కైవర్ బ్రంట్‌తో కలిసి దూకుడు పెంచింది. బౌండరీలు, సిక్సులతో వీరు లక్ష్యాన్ని తగ్గిస్తూ వచ్చారు. వీరిద్దరూ కలిసి 44 బంతుల్లో 68 పరుగులు జోడించడంతో లక్ష్యానికి చేరువైంది. 17 బంతుల్లో 12 పరుగులు చేయాల్సిన దశలో క్యాప్సీ వెనుదిరిగింది. అయితే ఆఖర్లో ఉత్కంఠగా సాగింది. 7 బంతుల్లో 2 పరుగులు సాధించాల్సిన తరుణంలో స్కైవర్ బ్రంట్ కూడా బౌల్డై వెనుదిరిగింది. ఆఖరి ఓవర్ మొదటి బంతికే నైట్ ఔటవ్వడంతో ఉత్కంఠ నెలకొంది. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్‌ఉమెన్ గిబ్సన్ రివర్స్ స్వీప్‌తో ఫోర్ కొట్టి జట్టుకు విజయం ఖరారు చేసింది.ఆస్ట్రేలియా బౌలర్లలో మెగాన్ షట్ 2 వికెట్లు తీసింది.

అంతకు ముందు మొదటి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నెమ్మదిగా మొదలు పెట్టింది. పవర్ ప్లే ముగిసే సరికి 6 ఓవర్లలో వికెట్ కోల్పోయి 36 పరుగులు మాత్రమే చేసింది. ఇతర బ్యాట్స్‌మెన్ ఎల్లీస్ పెర్రీ, ఆష్లే గార్డ్‌నర్లు ధాటిగా ఆడటంతో 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది.

Tags

Read MoreRead Less
Next Story