బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయం..

బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయం..
Ben Stokes: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. భారత్‌తో టెస్ట్ సిరీస్ ఆరంభం కావడానికి నాలుగు రోజుల ముందు బెన్‌స్టోక్స్ నిర్ణయం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది.

Ben Stokes: ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్‌స్టోక్స్ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నాడు. కేరీర్ అత్యున్నత స్థితిలో ఉన్న సమయంలో ఎలాంటి క్రికెటర్ కూడా తీసుకోని నిర్ణయం అది. భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ఆరంభం కావడానికి సరిగ్గా నాలుగు రోజుల ముందు అతను ఇచ్చిన ఈ సమాచారం క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కలవరపాటుకు గురి చేస్తోంది. ఆధునిక క్రికెట్‌లో..కేరీర్‌లో ఉచ్ఛస్థితిలో ఉండగా..అతను చేసిన ఈ ప్రకటను కారణమేంటనే విషయం ఆసక్తి రేపుతోంది.అన్ని ఫార్మట్ల క్రికెట్ నుంచి నిరవధిక విరామాన్ని తీసుకుంటోన్నట్లు బెన్‌స్టోక్స్ ప్రకటించాడు. దీనికి సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్‌కు తెలియజేశాడు. తక్షణమే తన నిర్ణయం అమల్లోకి వస్తుందనీ చెప్పాడు.

ఆగస్టు 4వ తేదీ నుంచి భారత్‌తో అయిదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ ప్రారంభం కాబోతోన్న ఈ పరిస్థితుల్లో బెన్‌స్టోక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఆ దేశ క్రికెట్ జట్టులో బాంబును పేల్చినట్టయింది. సరిగ్గా నాలుగు రోజుల్లో తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉన్న ఈ పరిస్థితుల్లో అతను చేసిన ప్రకటన ఇంగ్లాండ్ జాతీయ జట్టును ఒత్తిడిలోకి నెట్టినట్టయింది.బెన్‌స్టోక్స్ కొన్నేళ్లుగా క్రికెట్ ఆడుతూ వస్తోన్నాడు. ప్రత్యేకించి- గత ఏడాది మొత్తం అతను ఇంటికి దూరం అయ్యాడు.

కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ వస్తోన్నాడు క్రికెట్ వల్ల. గత ఏడాది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించిన ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఈ ఏడాది ఆరంభంలో భారత పర్యటన.. ఆ వెంటనే మళ్లీ ఐపీఎల్ 2021, అది ముగిసిన వెంటనే స్వదేశంలో న్యూజిలాండ్ జట్టుతో రెండు టెస్ట్ మ్యాచ్‌లను ఆడాడు బెన్. పాకిస్తాన్ పర్యటనలో ఉన్నాడు. ఇక భారత్‌తో అయిదు టెస్టుల సిరీస్ ఈ బుధవారమే ట్రెంట్‌బ్రిడ్జిలో ప్రారంభం కానుంది. ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్ సెకెండ్ ఫేస్, ఆ తరువాత టీ20 ప్రపంచకప్‌ను ఆడాల్సి ఉంది.క్రికెటర్లు ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారి బారిన పడకుండా ఉండటానికి అన్ని దేశాల క్రికెట్ బోర్డులు బయో సెక్యూర్ బబుల్‌ను అమలు చేస్తోన్నాయి. ఈ బయో బబుల్ వ్యవస్థ.. పరిమితంగా ఉండే ఓ కొత్త ప్రపంచం.షెడ్యూల్‌ను ప్రకటించిన తరువాత క్రికెటర్లందరూ అందులో వెళ్లాల్సి ఉంటుంది. అందులో ఉన్న వారితోనే కాంటాక్ట్‌ చేయాల్సి ఉంటుంది. సపోర్టింగ్ స్టాఫ్, వారు బస చేసే హోటల్ సిబ్బంది.. ఇలా పరిమితంగా మాత్రమే ఉంటారందులో. చివరికి కుటుంబ సభ్యులకు కూడా దూరం కావాల్సి ఉంటుంది.

ఇందులో ఇమడలేక పోవడం వల్లే బెన్‌స్టోక్స్ నిరవధిక విరామాన్ని తీసుకుని ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.వాటన్నింటికీ మించి.. గత ఏడాది డిసెంబర్‌లో ఇంటి పెద్దను కోల్పోయాడు బెన్‌స్టోక్స్. అతని తండ్రి గెడ్ స్టోక్స్ 65 సంవత్సరాల వయస్సులో బ్రెయిన్ కేన్సర్‌తో సుదీర్ఘ కాలం పాటు పోరాడుతూ గత ఏడాది డిసెంబర్‌లో తుదిశ్వాస విడిచారు. ఇది కూడా బెన్‌స్టోక్స్‌ను మానసికంగా కుంగదీసి ఉంటుందనే వాదనలు ఉన్నాయి. తండ్రికి బ్రెయిన్ కేన్సర్ ఉందనే విషయాన్ని డాక్టర్లు ధృవీకరించిన సమయంలో కూడా బెన్ అందుబాటులో లేడు. అప్పుడతను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నాడు.

ఆ సమాచారం తెలిసిన వెంటనే అతను అర్ధాంతరంగా పర్యటనను ముగించుకుని స్వదేశానికి వెళ్లాడు.బెన్‌స్టోక్స్ కుటుంబం కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌లో నివసిస్తోంది. బెన్‌కు 12 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడే అతని కుటుంబం న్యూజిలాండ్‌లో స్థిరపడింది. దీనికి కారణం- గెడ్ స్టోక్స్ రగ్బీ కోచ్ కావడం. 1982-83 సీజన్‌లో వర్కింగ్ టౌన్ రగ్బీ లీగ్ క్లబ్‌కు ఆయన ప్రాతినిథ్యాన్ని వహించాడు. 2003లో న్యూజిలాండ్ క్లబ్‌కు కోచ్‌గా నియమితులయ్యారు. దీనితో ఇంగ్లాండ్‌లోని కంబ్రియా నుంచి తన కుటుంబాన్ని న్యూజిలాండ్‌కు తీసుకెళ్లాడు.బెన్‌స్టోక్స్ కొంత మానసిక, శారీరక ఒత్తిడిని ఎదుర్కొంటోన్నాడని, అందువల్లే ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నాడని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ డైరెక్టర్ ఆష్లే గిల్స్ తెలిపాడు

Tags

Read MoreRead Less
Next Story