ENGLAND: ప్రత్యర్థి జట్లకు ఇంగ్లాండ్ బిగ్ వార్నింగ్

ENGLAND: ప్రత్యర్థి జట్లకు ఇంగ్లాండ్ బిగ్ వార్నింగ్
X
మరోస్థాయికి ఇంగ్లాండ్ బజ్‌బాల్ గేమ్... టీ20ల్లో 300కుపైగా పరుగులు చేసిన ఇంగ్లాండ్.. పొట్టి ప్రపంచకప్‌కు ముందు భారీ స్కోరు

టీ20ల్లో 300కు పైగా పరు­గు­లు సా­ధ్య­మే­నా? కొ­న్నా­ళ్లు­గా ఈ ప్ర­శ్న చా­లా­మం­ది­ని వెం­టా­డు­తోం­ది. ఐపీ­ఎ­ల్‌­లో సన్‌­రై­జ­ర్స్ హై­ద­రా­బా­ద్ వంటి జట్లు, 300 మా­ర్కు­కి దగ్గ­ర­గా వచ్చి­నా అం­దు­కో­లే­క­పో­యా­యి. అయి­తే అం­త­ర్జా­తీయ టీ20 క్రి­కె­ట్‌­లో 300+ స్కో­రు నమో­దు చే­సిం­ది ఇం­గ్లాం­డ్ జట్టు.. సౌ­తా­ఫ్రి­కా­తో రెం­డో టీ20 మ్యా­చ్‌­లో ని­ర్ణీత 20 ఓవ­ర్ల­లో 2 వి­కె­ట్ల నష్టా­ని­కి 304 పరు­గు­లు చే­సిం­ది ఇం­గ్లాం­డ్ జట్టు... టె­స్టు హోదా ఉన్న దే­శా­ల్లో టీ20ల్లో 300+ స్కో­రు బా­దిన మొ­ట్ట­మొ­ద­టి జట్టు­గా రి­కా­ర్డు క్రి­యే­ట్ చే­సిం­ది. ఓపె­న­ర్లు జోస్ బట్ల­ర్, ఫి­లి­ప్ సా­ల్ట్ కలి­సి తొలి వి­కె­ట్‌­కి 7.5 ఓవ­ర్ల­లో­నే 126 పరు­గుల భా­గ­స్వా­మ్యం జో­డిం­చా­రు. 30 బం­తు­ల్లో 8 ఫో­ర్లు, 7 సి­క్స­ర్ల­తో 83 పరు­గు­లు చే­సిన జోస్ బట్ల­ర్, 8వ ఓవ­ర్‌­లో అవు­ట్ అయ్యా­డు. జా­క­బ్ బె­థ­ల్ 14 బం­తు­ల్లో 2 ఫో­ర్లు, 2 సి­క్స­ర్ల­తో 26 పరు­గు­లు చే­శా­డు. 305 పరుగుల భారీ లక్ష్యఛేదనలో సౌతాఫ్రికా జట్టు 16.1 ఓవర్లలో 158 పరుగులకి ఆలౌట్ అయ్యింది. అయిడిన్ మార్క్‌రమ్, రియాన్ రికెల్టన్ కలిసి 3.4 ఓవర్లలో 50 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

గత రికార్డులు ఇవీ

ఈ దె­బ్బ­తో ఇం­గ్లాం­డ్ టీ20ల్లో మూడో అత్య­ధిక స్కో­ర్ ను సా­ధిం­చిన జట్టు­గా రి­కా­ర్డు­కు ఎక్కిం­ది. 2024లో జిం­బా­బ్వే జట్టు గాం­బి­యా­పై 344 పరు­గు­ల­తో ప్ర­పంచ రి­కా­ర్డు­ను నె­ల­కొ­ల్పిం­ది. ఆ తర్వాత 2023లో నే­పా­ల్‌ 314 పరు­గు­ల­తో రెం­డో స్థా­నం­లో ఉంది. కా­క­పో­తే, టె­స్టు దే­శా­లు అర్హత ఉన్న అత్య­ధిక టీ20 స్కో­రు మా­త్రం ఇదే. ఇక భారీ అనం­త­రం లక్ష్య ఛే­ద­న­కు ది­గిన దక్షి­ణా­ఫ్రి­కా­ను కే­వ­లం 158 పరు­గు­ల­కే ఆలౌ­ట్ చే­సిం­ది. దీం­తో 146 పరు­గుల భారీ తే­డా­తో ఇం­గ్లాం­డ్‌ వి­జ­యం అం­దు­కుం­ది. ఈ మ్యా­చ్ తో అం­త­ర్జా­తీయ టీ20ల్లో అత్య­ధిక పరు­గు­ల­తో వి­జ­యం సా­ధిం­చిన జట్టు­గా ఇం­గ్లాం­డ్‌ రి­కా­ర్డు సృ­ష్టిం­చిం­ది.

వన్డే చరిత్రలోనూ సంచలనం

వన్డే క్రి­కె­ట్లో ఇం­గ్లం­డ్ జట్టు ప్ర­పంచ రి­కా­ర్డు సృ­ష్టిం­చిం­ది. దక్షి­ణా­ఫ్రి­కా­ను 342 పరు­గుల తే­డా­తో ఓడిం­చి రి­కా­ర్డు­లు తి­ర­గ­రా­సిం­ది ఇం­గ్లాం­డ్. ఇది ODI క్రి­కె­ట్ చరి­త్ర­లో పరు­గుల పరం­గా ఓ జట్టు సా­ధిం­చిన అతి­పె­ద్ద వి­జ­యం. ఈ మ్యా­చ్‌­లో మొదట బ్యా­టిం­గ్ చే­సిన ఇం­గ్లం­డ్ ని­ర్ణీత 50 ఓవ­ర్ల­లో 414 పరు­గు­లు చే­సిం­ది. రి­కా­ర్డు పరు­గు­ల­ను ఛే­జిం­గ్ చే­య­డా­ని­కి బ్యా­టిం­గ్ కు ది­గిన దక్షి­ణా­ఫ్రి­కా జట్టు ఏమా­త్రం పో­రా­డ­కుం­డా చే­తు­లె­త్తే­సిం­ది. సఫా­రీ టీం కే­వ­లం 72 పరు­గు­ల­కే ఆలౌ­ట్ అవ్వ­డం­తో 342 పరు­గుల తే­డా­తో ఇం­గ్లాం­డ్ చా­రి­త్రా­త్మక వి­జ­యా­న్ని అం­దు­కుం­ది. మరో­వై­పు దక్షి­ణా­ఫ్రి­కా జట్టు వన్డే­ల్లో హయ్యె­స్ట్ ఛే­జిం­గ్ టీం­గా­నే కాదు, వన్డే­లో అతి­పె­ద్ద ఓట­మి­ని చవి­చూ­సిన జట్టు­గా­నూ చె­త్త రి­కా­ర్డు­ను తమ ఖా­తా­లో వే­సు­కుం­ది. వన్డే­ల్లో పరు­గుల పరం­గా అతి­పె­ద్ద వి­జ­యం ఇం­గ్లాం­డ్ ఖా­తా­లో­కి చే­రిం­ది. దక్షి­ణా­ఫ్రి­కా­తో జరి­గిన మ్యా­చ్ లో 342 పరు­గుల తే­డా­తో ఓడిం­చిం­ది. శ్రీ­లం­క­పై 317 పరు­గుల తే­డా­తో నె­గ్గిన టీం ఇం­డి­యా రెం­డవ స్థా­నం­లో ఉంది. ఇటు వన్డేల్లోనూ అటు టీ 20ల్లోనూ ఊచకోత కోస్తున్న ఇంగ్లాండ్ బ్యాటర్లు.. టీ 20 ప్రపంచక్ నకు ముందు ప్రత్యర్థి జట్లకు వార్నింగ్ ఇస్తున్నారు.

Tags

Next Story