క్రీడలు

England vs India: ఐదో రోజు మ్యాచ్ ఆలస్యం..

England vs India: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు మ్యాచ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది.

England vs India:  ఐదో రోజు మ్యాచ్ ఆలస్యం..
X

England vs India: ఆతిథ్య ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టు ఐదు రోజు మ్యాచ్ ఆలస్యం అయ్యేలా కనిపిస్తుంది. చివరిదైన ఐదు రోజు మైదానంలో వర్షం కురుస్తోంది. ఆఖరి రోజు భారత్ విజయానికి 157 పరుగులు అవసరమయ్యాయి. ఈ క్రమంలోనే ఛేదనకు దిగిన భారత్‌ నాలుగో రోజు 52/1 స్కోర్‌తో నిలిచింది. క్రీజులో హిట్ మ్యాన్ రోహిత్‌ శర్మ(12), చెతేశ్వర్‌ పుజారా(12) ఉన్నారు. చేతిలో ఇంకా తొమ్మిది వికెట్లు ఉన్నాయి. ఇక కేఎల్‌ రాహుల్‌(26) నిన్న తొలి వికెట్‌గా వెనుదిరిగిన సంగతి తెలిసిందే. అంతకుముందు ఇంగ్లాండ్‌ 303 పరుగులకు రెండో ఇన్నింగ్స్‌లో ఆలౌటైంది. టీమ్‌ఇండియా తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం 95 పరుగులు కలుపుకొని లక్ష్యం ఇప్పుడు 209 పరుగులుగా నమోదైంది. ఇక ఐదో రోజు ఆట ప్రారంభానికి ముందు అక్కడ వర్షం కురుస్తుండటంతో మ్యాచ్‌ ఆలస్యమయ్యేలా కనిపిస్తోంది.

Next Story

RELATED STORIES