ఇంగ్లాండ్ సరికొత్త రికార్డ్.. 2012 తర్వాత తొలిసారి..

ఇంగ్లాండ్ సరికొత్త రికార్డ్.. 2012 తర్వాత తొలిసారి..
India Vs England: లీడ్స్ వేదికగా టీమిండియా- ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు జరుతుంది.

India Vs England: లీడ్స్ వేదికగా టీమిండియా- ఇంగ్లాండ్‌ మధ్య మూడో టెస్టు జరుతుంది. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ ఆధిపత్యం కొనసాగుతోంది. కెప్టెన్‌ జో రూట్‌(80, 140 బంతుల్లో, 9ఫోర్లు)సెంచరీ దిశగా సాగుతున్నాడు. మరో బ్యాట్స్ మెన్ డేవిడ్‌ మలన్‌ (70, 128బంతుల్లో,18 ఫోర్లు) పరుగుల చేసి ఔటైయ్యాడు. సిరాజ్‌ బౌలింగ్‌లో మలన్‌ కీపర్‌ చేతికి చిక్కి ఔటయ్యాడు. వీరిద్దరూ మూడో వికెట్ కి 139 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్‌ టీ బ్రేక్‌ సమయానికి 94 ఓవర్లలో 298/3 స్కోర్‌తో నిలిచింది. ప్రస్తుతం ఆతిథ్య జట్టు 220 పరుగులుగా భారీ ఆథిక్యంతో కొనసాగుతుంది.

అంతకుముందు లాంచ్ సమయానికి 182/2తో ఉన్న ఇంగ్లాండ్‌ను రూట్‌, మలన్‌ అద్భుతంగా రాణించారు. ముఖ్యంగా ఇంగ్లాండ్‌ సారథి వన్డే తరహా ఆడాడు. అతడికి మలన్‌ నుంచి పూర్తి సహకారం అందింది. ఈ క్రమంలోనే రూట్‌ తొలుత అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు ఓపెనర్లు రోరీ బర్న్స్‌(61), హమీద్‌(68) కూడా అర్ధ శతకాలతో రాణించారు. దాంతో తొలిసారి .. 2012 తర్వాత ఒకే ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ టాప్‌ నలుగురు బ్యాట్స్‌మెన్‌ హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత్ తొలి ఇన్నింగ్స్ 78 పరుగులకే ఆలౌటైంది.

Tags

Read MoreRead Less
Next Story