Eng vs Aus: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌దే గెలుపు, ఆసీస్‌ వద్దే యాషెస్

Eng vs Aus: ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌దే గెలుపు, ఆసీస్‌ వద్దే యాషెస్
ఇంగ్లండ్- 283 (బ్రూక్ 85, స్టార్క్ 4-82) మరియు 395 (రూట్ 91, బెయిర్‌స్టో 78, క్రాలే 73, స్టార్క్ 4-100, మర్ఫీ 4-110), ఆస్ట్రేలియా 295 (స్మిత్ 71) మరియు 334 (ఖవాజా 72, వార్నర్ 60, స్మిత్ 54) వోక్స్ 4-50)

టెస్టులపై అభిమానులు ఇంకా ఆసక్తి కనబరుస్తున్నారంటే అందుకు ప్రతీ సంవత్సరం జరిగే యాషెస్ సిరీస్‌(Ashes Series) ఎంతగానో సహకరిస్తుందంటే అతిశయోక్తి కాదు. ఇతర దేశాల మధ్య జరిగే టెస్ట్‌ సిరీస్‌ల కంటే యాషెస్ సిరీస్‌ ప్రత్యేకం అనడంలో సందేహం లేదు. సిరీస్‌లోని ప్రతీ మ్యాచ్‌ ఉత్కంఠకు దారి తీస్తూ టెస్ట్‌పై ఆసక్తి కలిగించడం యాషెస్‌కే చెల్లుతుంది.

ప్రస్తుతం జరిగిన యాషెస్ సిరీస్‌ కూడా అందుకు భిన్నం ఏమీ కాదు. చివరి టెస్ట్‌లో మ్యాచ్ ఇరుజట్ల దోబూచులాడి ఉత్కంఠగా జరిగి యాషెస్‌కి మంచి ముగింపు లభించింది. 3వ రోజు చివరి వరకు భారీ ఆధిక్యంలో నిలిచిన ఇంగ్లాండ్‌దే పైచేయి అనుకున్నారంతా, కానీ ఆ రోజు బ్యాటింగ్‌కి దిగిన ఆస్ట్రేలియా జట్టు ఓపెనర్లు రాణించడంతో భారీ లక్ష్యఛేదనలో ఫేవరెట్‌గా నిలిచింది. 5వ రోజు కూడా ఆ ఊపును కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టు విజయం ఖాయం అన్పించేలా ఆడారు. ఒకానొక దశలో 264/3 తో గెలుపు స్థితిలో ఉన్న జట్లు 275/7 కి చేరి ఓటమిని కొనితెచ్చుకుంది. చివరికి 334 పరుగులకు ఆలౌటై 49 పరుగుల తేడాతో మ్యాచ్‌ను చేజార్చుకుంది. దీంతో సిరీస్‌ 2-2తో సమం అయింది. సిరీస్‌ సమం కావడంతో యాషెస్‌ టైటిల్‌ను ఆస్ట్రేలియానే అట్టిపెట్టుకుంది.

135 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో 5వ ఆరంభించిన ఆస్ట్రేలియా 140 పరుగుల వద్ద డేవిడ్ వార్నర్(60) వికెట్‌ని కోల్పోయింది. మరో ఒక్క పరుగు మాత్రమే జోడించి మరో ఓపెనర్‌ ఖవాజా(72)ని కూడా కోల్పోయింది. 32 బంతుల్లో 13 పరుగులు చేసిన లబుషేన్ 3వ వికెట్‌గా వెనుదిరిగాడు. స్మిత్(54), ట్రావిస్ హెడ్‌(43)లు పట్టుదలతో ఆడుతూ స్కోర్‌ను 250 పరుగులు దాటించి లక్ష్యానికి దగ్గర చేశారు. స్మిత్ 89 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేశాడు. కానీ తర్వాతి బంతికే హెడ్‌ని మొయిన్ అలీ ఔట్‌ చేశాడు. తర్వాతి ఓవర్లోనే క్రీజులో కుదురుకున్న స్టీవ్ స్మిత్ కూడా స్లిప్‌లో క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. మిషెల్ మార్ష్(6) కూడా తర్వాతి ఓవర్లో మొయిన్‌ అలీకి చిక్కాడు. వచ్చీ రాగానే మిషెల్ స్టార్క్ కూడా ఔటయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 11 పరుగుల వ్యవధిలోనే కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. మరో 19 పరుగులు జోడించిన అనంతరం 8వ వికెట్‌ని కోల్పోయింది. అప్పటికి ఆస్ట్రేలియా విజయానికి 90 పరుగులు అవసరమయ్యాయి. తర్వాత అలెక్స్ కారే, మర్ఫీలు ప్రతిఘటించినా చివరి 2 వికెట్లను స్టువర్ట్ బ్రాడ్ తీయడంతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. ఇంగ్లాండ్ ఆటగాళ్లు సంబరాల్లో మునిగిపోయారు. చివరి రెండు వికెట్లు తీసి, తన కెరీర్‌కి ఘనంగా వీడ్కోలు పలికాడు స్టువర్ట్ బ్రాడ్.


Tags

Read MoreRead Less
Next Story