Australia vs England: 4వ రోజు ఇంగ్లాండ్ ఆశలతో ఆడుకున్న వరుణుడు

Ashes 4th Test: యాషెస్ సిరీస్‌లో ఇంగ్లాండ్ యాషెస్ ఆశలు వరుణుడిపై ఆధారపడి ఉన్నాయి. 4వ రోజు ఆటకి ఎక్కువ భాగం వర్షార్పణమే కావడంతో ఇంగ్లాండ్ శిబిరంలో నిరాశ ఆవహించినట్లుంది. కేవలం 30 ఓవర్ల ఆట మాత్రమే కొనసాగింది. పట్టుదల కొనసాగించిన ఆస్ట్రేలియా ఆటగాడు మార్నస్ లబుషేన్(173 బంతుల్లో 111, 10x4, 2x6) ఇంగ్లాండ్ బౌలర్లకు అడ్డుగోడగా నిలిచ, సెంచరీతో రాణించడంతో ఇంగ్లాండ్ ఆధిక్యం తగ్గుతూ వచ్చింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా 65 పరుగుల వెనకంజలో ఉంది. జో రూట్, కామెరూన్ గ్రీన్‌లు క్రీజులో ఉన్నారు.
మొదటి సెషన్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. 113/4 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ లబుషేన్, మిషెల్ మార్ష్ అడపాదడపా బౌండరీలతో బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొన్నారు. మార్నస్ 99 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు.
బౌలర్లను ఎంతగా మార్చినప్పటికీ వికెట్లు తీయడంలో విఫలం అయ్యారు. సన్‌లైట్ తక్కువగా ఉండటం, సేస్ బౌలింగ్ అయితే ఎక్కువ సమయం తీసుకుంటుందని అంపైర్లు చెప్పడంతో, బెన్‌స్టోక్స్ స్పిన్నర్ జో రూట్‌కు బంతినిచ్చాడు. స్పిన్నర్లను ఇద్దరూ అలవోకగా ఎదుర్కొన్నారు. జో రూట్ వరస బౌలింగ్‌లో మార్నస్ 2 సిక్స్‌లు కొట్టాడు. మొయిన్ అలీ బౌలింగ్‌లో మార్ష్ ఫోర్ కొట్టి ఆధిక్యం తగ్గిస్తూ వచ్చారు.
మార్నస్ 93 పరుగుల వద్ద ఉన్నపుడు వచ్చిన క్యాచ్ అవకాశాన్ని స్లిప్‌లో వదిలేశారు. తర్వాతి ఓవర్లోనే సింగిల్‌తో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది టెస్టుల్లో 11వ సెంచరీ.
జో రూట్ తన 5వ ఔవర్లో ఎట్టకేలకు మార్నస్ వికెట్ తీయడంతో ఇంగ్లాండ్ జట్టు ఊపిరి పీల్చుకుంది. కామెరూన్ గ్రీన్, మార్ష్‌లు మరె వికెట్ పడకుండా 2వ సెషన్‌ను ముగించారు.
తర్వాత భారీ వర్షంతో ఆట మొదలయ్యే అవకాశాలు లేకపోవడంతో అంపైర్లు 4వ రోజు ఆటని ఆపేశారు. చివరి రోజు వాన పడకుండా ఉంటే ఇంగ్లాండ్ జట్టు విజయంపై ఆశలు పెట్టుకోవచ్చు. కానీ ఆదివారం కూడా వర్షం పడే సూచనలు ఉండటంతో ఇంగ్లాండ్ శిబిరంలో కలవరం మొదలైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com