Vinod Kambli Arrested : టీంఇండియా మాజీ క్రికెటర్ అరెస్ట్...!

Vinod Kambli Arrested : టీంఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ మరో వివాదంలో చిక్కుకున్నారు.. తప్ప తాగి డ్రైవింగ్ చేస్తూ ముంబైలోని బాంద్రా సొసైటీ వద్ద ప్రయాణిస్తున్న కారును ఢీకొట్టారు. అంతేకాకుండా సొసైటీ గార్డ్‌తో వాగ్వాదానికి దిగాడు. సొసైటీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు వినోద్ కాంబ్లీని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ RW185 (మద్యం సేవించి వాహనం నడపడం) కింద అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం బెయిల్ పై విడుదలయ్యాడు. కాంబ్లీ ఇండియా తరుపున 17 టెస్టులు ఆడి 4 సెంచరీలతో సహా 1084 పరుగులు చేశాడు. అటు 104 వన్డే మ్యాచ్‌లు ఆడాడు, 2 సెంచరీలతో 2,477 పరుగులు చేశాడు. 2000 అక్టోబర్‌లో చివరి మ్యాచ్ ఆడాడు. అయితే ఆటతో కన్నా ఎక్కువగా వివాదాలతోనే వార్తల్లో నిలిచాడు కాంబ్లీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com