FIFA 2022: థాంక్యూ కేరళ.. ఇండియన్ ఫ్యాన్స్ కోసం నేమర్ స్పెషల్ మెసేజ్

kerala
FIFA 2022: థాంక్యూ కేరళ.. ఇండియన్ ఫ్యాన్స్ కోసం నేమర్ స్పెషల్ మెసేజ్
భారత్ అభిమానానికి పులకరించిపోయిన ఫుట్ బాల్ దిగ్గజం, థ్యాంక్యూ కేరళ అంటూ ప్రత్యేక సందేశాన్ని పంపించిన నేమర్; కేరళలో తన నిలువెత్తు కటౌట్ కు ధన్యవాదాలు

Kerala: ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం, బ్రెజిల్ ఆటగాడు నేమర్ భారత్ నుంచి లభిస్తున్న ప్రేమకు ఉబ్బితబ్బిబైపోతున్నాడు. ముఖ్యంగా కేరళలో ఈ క్రీడకు నెలకొన్న క్రేజ్ ను చూసి సంబరపడిపోతున్న నేమర్ వారి అభిమానానికి ప్రతిగా ఓ చక్కని సందేశాన్ని పంపాడు. థ్యాంక్యూ కేరళ అంటూ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు.



కేరళలో ఫుట్ బాల్ క్రీడకు నెలకొన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. అక్కడ ప్రతి టీమ్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొన్ని సార్లు వివిధ బృందాల మధ్య పోరు జరిగిన సందర్భాలు సైతం అనేకం. ఇక వరల్ట్ కప్ పుణ్యమా అని ఫిఫా ఫీవర్ తో ఊగిపోతున్న కేరళలోని కోజికోడ్ జిల్లాలో పల్లవూర్ చెరువు దగ్గర నేమర్, క్రిస్టియానో రోనాల్టో భారీ కటౌట్లను ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు.



అంతర్జాతీయ ఫుట్ బాల్ గవర్నింగ్ బాడీ ఈ కటౌట్లను గుర్తించి తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ ముచ్చటను పోస్ట్ చేసింది. ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ కేరళను తాకింది అంటూ ట్వీట్ చేసింది. దీనికి బదులుగా కేరళ సీఎం పినరయి విజయన్ కూడా కేరళీయులు ఫుట్ బాల్ క్రీడను నిరంతరం ఆస్వాదిస్తూనే ఉంటారంటూ రిప్లై ఇచ్చారు.



పల్లవూర్ చెరువు దగ్గర ఏర్పాటు చేసిన తన భారీ కటౌట్ ను చూసుకుని మురిసిపోయిన నేమర్ తన ఇన్స్టా పోస్ట్ లో 'ప్రేమ ప్రపంచ నలుమూలల నుంచి లభిస్తుందని, థాంక్యూ సో మచ్ కేరళ, ఇండియా' అని రాశాడు.


ఇది ఇలా ఉండగా వరల్డ్ కప్ ఫైనల్స్ లో పాలుపంచుకోకుండానే బ్రెజిల్ నిష్క్రమించడంతో నేమర్ మళ్లీ బ్రెజిల్ కు ఆడాలన్న సంకల్పాన్నే కోల్పోయినట్లు తెలుస్తోంది. ఇప్పుడు మాట్లాడటం సరికాదు అంటూనే భవిష్యత్తులో బ్రెజిల్ ఆడాలా వద్దా అన్న విషయంపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని స్పష్టం చేశాడు.


Tags

Read MoreRead Less
Next Story