FIFA Womens: జులై 20 నుంచి వరల్డ్ కప్, అభిమానులు ఎలా వీక్షించాలంటే

FIFA మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్(WorldCup) జులై 20 నుంచి ప్రారంభమవనుంది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాల్లో జరగనున్న మ్యాచుల్లో 32 దేశాలు పాల్గొననున్నాయి. ఆగస్ట్ 20న సిడ్నీ ఒలంపిక్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మొదటి మ్యాచ్ న్యూజిలాండ్, నార్వే మధ్య జరగనుంది.
అమెరికా మహిళల ఫుట్‌బాల్ జట్టు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలో దిగనుంది. అమెరికా 2019లో ప్రాన్స్‌లో జరిగిన, 2015లో కెనడాలో జరిగిన వరల్డ్ కప్పుల్లో విజేతగా నిలిచింది. 2023 వరల్డ్ కప్‌ని కూడా గెలిచిన హ్యాట్రిక్ కొట్టాలని ఉవ్వీళ్లూరుతుంది. అయితే ప్రస్తుత టోర్నీలో ఎక్కువ యువ క్రీడాకారిణులతోనే బరిలోకి దిగనుంది. వారు ఎంతవరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే. 2019 వరల్డ్‌కప్ ఫైనల్లో ఓడిన నెదర్లాండ్స్ ఈ సారి ప్రతీకారం కోసం వేచి చూస్తోంది.
ప్రస్తుత ఫుట్‌బాల్‌లో సూనర్ ఫాంలో ఉన్న ఇంగ్లాండ్ జట్టు కూడా ఫేవరెట్లలో ఒకటిగా రానున్నారు. గత సమ్మర్‌లో యూరో కప్‌ని గెలిచి ఊపుమీద ఉంది. గత 2 వరల్డ్‌కప్‌ల్లో కూడా సెమీఫైనల్ వరకు మాత్రమే రాగలిగింది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ జట్లు అమెరికాని ఇంటికి పంపాలనే పట్టుదలతో ఉన్నాయి. వరల్డ్‌కప్ ఆతిథ్యం ఇస్తున్న ఆస్ట్రేలియా కూడా పేవరెట్లలో ఒకటి.
32 జట్లను 8 గ్రూపులుగా విభజించారు.
గ్రూప్ A: న్యూజిలాండ్, నార్వే, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్
గ్రూప్ B: ఆస్ట్రేలియా, ఐర్లాండ్, నైజీరియా, కెనడా
గ్రూప్ సి: స్పెయిన్, కోస్టారికా, జాంబియా, జపాన్
గ్రూప్ డి: ఇంగ్లండ్, హైతీ, డెన్మార్క్, చైనా
గ్రూప్ E: నెదర్లాండ్స్, పోర్చుగల్, యునైటెడ్ స్టేట్స్, వియత్నాం
గ్రూప్ ఎఫ్: బ్రెజిల్, ఫ్రాన్స్, జమైకా, పనామా
గ్రూప్ G: అర్జెంటీనా, ఇటలీ, దక్షిణాఫ్రికా, స్వీడన్
భారత్‌లో ఎలా చూడాలంటే..
భారత అభిమానులు FanCode మొబైల్ యాప్ (Android, iOS, TV), Android TVలో TV యాప్, Amazon Fire TV Stick, Jio STB, Samsung TV, Airtel XStream, OTT Play మరియు www.fancode.comలో ప్రత్యక్ష ప్రసారాల్ని చూడవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com