FIFA World Cup 2022 prize money: ఫిఫా వరల్డ్‌కప్ ప్రైజ్ మనీ ఎంతో తెలిస్తే షాకే..

FIFA World Cup Prize Money: 2022 ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌లో పెనాల్టీ షూటౌట్ ఫైట్‌లో ఫ్రాన్స్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది అర్జెంటీనా. ఉత్కంఠ మ్యాచ్‌లో మొదట స్కోరు 2-2తో టై కాగా, అడిషనల్ టైం ఇచ్చారు.. ఈ సూపర్ టైంలో స్కోరు 3-3తో మళ్లీ టై అయింది. దీంతో పెనాల్టీ షూటౌట్ తప్పలేదు. షూటౌట్‌లో అర్జెంటీనా 4-2తో గెలిచి వరల్డ్ ఫేవరేట్ లియోనెల్ మెస్సీ డ్రీమ్‌ను సాధించింది అర్జెంటీనా. లాస్ట్ వరల్డ్ కప్ ఆడిన లియోనెల్ మెస్సీ తన మెగా కెరీర్‌ను గ్రాండ్‌గా ముగించాడు. ఈ మ్యాచ్‌లో మెస్సీ రెండు గోల్స్ చేశాడు. ఫస్టాఫ్‌లో ఒకటి.. సూపర్ టైంలో ఓ గోల్ కొట్టి అర్జెంటైనాకు సూపర్ విక్టరీని అందించాడు.
అయితే ఈ వరల్డ్‌కప్‌కు ఫిఫా నిర్ణయించిన ప్రైజ్ మనీని చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే.. మొత్తం టోర్ని ప్రైజ్ మనీ 440 మిలియన్ డాలర్లు. ఈ అమౌంట్ గత వరల్డ్ కప్ కంటే కంటే 40 మిలియన్ డాలర్లు ఎక్కువ అన్నమాట. ఇక వరల్డ్ గెలిచిన అర్జెంటీనా కు 42 మిలియన్ డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 348 కోట్ల 48 లక్షలు అందుతుంది.. అలాగే చివరి వరకు టఫ్ ఫైట్ ఇచ్చి రన్నరప్‌గా నిలిచిన ఫ్రాన్స్‌కు 30 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 248 కోట్ల 20 అన్న మాట.
ఇక విన్నర్,రన్నరప్ కాకుండా, థర్డ్ ప్లేస్‌లో ఉన్న టీంకు 27 మిలియన్లు అంటే 220 కోట్లు ఇస్తారు. అలాగే ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న టీంకు 25 మిలియన్ డాలర్లు అంటే 204 కోట్లు దక్కనున్నాయి. ఇవి కాకుండా 5 నుంచి 8 స్థానాల్లో ఉన్న జట్లకు 17 మిలియన్ డాలర్లు అంటే 138 కోట్లు, 9 నుంచి 16 నంబర్‌లో ఉన్న టీంలకు 13 మిలియన్ డాలర్లు అంటే 106 కోట్ల ఫ్రైజ్ మనీ దక్కనుంది. ఇక 17 నుంచి 32 స్థానాల్లో ఉన్న టీంలకు 9 మిలియన్ డాలర్లు అంటే 74 కోట్లు బహుమతిగా ఇవ్వనుంది ఫిఫా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com