FIRE: సన్‌రైజర్స్ జట్టు బస చేసిన హోటల్లో అగ్ని ప్రమాదం..!

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ప్రముఖ పార్క్ హయత్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అంతా భయాందోళనలకు గురయ్యారు. ఇదే హోటల్‌లోని అయిదో అంతస్తులో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బస చేస్తుండటంతో ప్లేయర్లకు ఏమైనా అయిందా అన్న ఉత్కంఠ రేగింది. ఎస్‌ఆర్‌హెచ్ ఆటగాళ్లు ఇప్పుడు ఎలా ఉన్నారు.. అని అంతా టెన్షన్ పడ్డారు. అయితే వారు సురక్షితంగానే ఉన్నారని హైదరాబాద్ యాజమాన్యం వెల్లడించింది.
ఒక్కసారిగా ఎగిసపడ్డ మంటలు
పార్క్ హయత్‌లోని ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో హోటల్ అంతా దట్టమైన పొగలు అలముకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన హోటల్ స్టాఫ్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో అక్కడకు చేరుకున్న సిబ్బంది త్వరగా మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. స్పా రూమ్స్ లో స్టీమ్ బాత్ చేసే ప్రాంతంలో షర్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిపారు. స్పా రూమ్స్ ఉడ్ తో తయారు చేసి ఉంది.. అందుకే మంటలు అంటుకున్నాయని, పొగ దట్టంగా కమ్ముకోవడం వల్ల ప్రమాదం జరిగిన చోటుకు పార్క్ సిబ్బంది వెళ్లలేకపోయారని పేర్కొన్నారు. అయితే హోటల్‌లో బస చేస్తున్న సన్‌రైజర్స్ ఆటగాళ్లు అంతా సేఫ్‌గా ఉన్నారని హోటల్ స్టాఫ్ తెలిపారు. ఆటగాళ్లను అక్కడి నుంచి ఖాళీ చేయించి రెండు బస్సుల్లో వేరే ప్లేస్‌కు తీసుకెళ్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ప్రమాదం జరిగిన వెంటనే SRH టీమ్ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనే దాంట్లో నిజం లేదని, వాళ్ళు ముంబై తో మ్యాచ్ కోసం ఈ రోజు మధ్యాహ్నం 12కు ముంబై బయల్దేరారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో ఆటగాళ్లకు ఎలాంటి అపాయం కలగలేదని హోటల్ యాజమాన్యం వెల్లడించింది. ఈ ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ ప్రయాణం సాఫీగా సాగడం లేదు. తొలి మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన కమిన్స్ సేన.. ఆ తర్వాత వరుసగా 4 మ్యాచుల్లో ఓడిపోయింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com