Tokyo Olympics: కరోనా కలకలం..ఆ విలేజ్‌లో తొలి పాజిటివ్ కేసు

Tokyo Olympics
Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌కు వైరస్ గండం పొంచి ఉన్నట్లే కనిపిస్తోంది. మరో ఆరు రోజుల్లో క్రీడా సంబరం ప్రారంభం అవుతుండగా... ఒలింపిక్స్ విలేజ్‌లో తొలి కరోనా కేసు నమోదైంది. స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తుండగా... ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు... క్రీడల నిర్వాహక కమిటీ ప్రతినిధులు ప్రకటించారు. భద్రతా కారణాల దృష్ట్యా అతని పేరు, ఇతర వివరాలు బయటపెట్టలేదు. అయితే అతను స్థానికుడు కాదని.. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి అని తెలుస్తోంది. దీంతో అతణ్ని విలేజ్ నుంచి బయటకు తీసుకొచ్చి... ఓ హోటల్‌లో ఐసోలేషన్‌లో ఉంచినట్లు కమిటీ ప్రతినిధులు తెలిపారు.
ఈ నెల 23 నుంచి టోక్యోలో ఒలింపిక్స్ ప్రారంభం కానున్నాయి. దీని కోసం ఈ నెల 13 వ తేదీనే క్రీడా గ్రామాన్ని తెరిచారు. ఇప్పటికే వేలాది మంది అథ్లెట్లు, అధికారులు ఈ గ్రామానికి చేరుకున్నారు. కరోనా నేపథ్యంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఇంత చేస్తున్నా... కరోనా కేసు బయటపడడం ఒలింపిక్స్ నిర్వాహకులను కలవరపాటుకు గురిచేసింది.
Also Read: మహాకవి యోగి వేమన నిజంగానే బట్టలు లేకుండా ఉండేవారా?
© Copyright 2023 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com