FIXING: భారత టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం

భారత్‌లో జరుగుతున్న యూపీ టీ20 లీగ్‌లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు సంచలనం సృష్టించాయి. కాశీ రుద్రాస్ జట్టు మేనేజర్ అర్జున్ చౌహాన్‌ను బుకీగా పరిచయం చేసుకున్న వ్యక్తి, మ్యాచ్ ఫిక్సింగ్‌కు ఆహ్వానించాడని ఫిర్యాదు అందింది. ఒక్కో మ్యాచ్‌కు రూ. 50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఆఫర్ చేశాడని తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మ్యాచ్ ముగియగానే పేమెంట్
మ్యాచ్ ఫిక్సింగ్‌కు ప్రయత్నం జరిగినట్టు బీసీసీఐకి చెందిన యాంటీ కరెప్షన్ యూనిట్(ఏసీయూ) గుర్తించింది. ఏసీయూ ఫిర్యాదు మేరకు లక్నో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ ప్రకారం.. కాశీ రుద్రాస్ టీమ్ మేనేజర్ అర్జున్ చౌహాన్‌కు మ్యాచ్ ఫిక్సింగ్ చేయాలని ఆగస్టు 19న ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా నుంచి మెసేజ్‌లు వచ్చాయి. తాను పెద్ద బూకీగా పరిచయం చేసుకున్న సదరు వ్యక్తి అర్జున్‌కు మ్యాచ్ ఫిక్సింగ్‌కు రూ. కోటి ఆఫర్ చేశాడు. అలాగే, కమీషన్‌గా రూ. 50 లక్షలు ఇస్తానని చెప్పాడు. తాను చెప్పిన ప్లేయర్ల ప్రదర్శన తనకు అనుకూలంగా ఉండాలని, మ్యాచ్ ముగిసిన వెంటనే అమెరికా డాలర్లు లేదా నగదు రూపంలో చెల్లింపులు చేస్తానని వాయిస్ కాల్స్, మెసేజ్‌ల రూపంలో తెలిపాడు. ఏసీయూ స్క్రీన్ షాట్స్, ఆడియో క్లిప్స్లను సేకరించింది. కాశీ రుద్రాస్ టీమ్ మేనేజర్ అర్జున్ చౌహాన్‌కు ‘vipss_nakrani’ అనే యూజర్ నుంచి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఓ మెసెజ్ వచ్చింది. అందులో తను బుకీని అని, మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తే కోటి రూపాయలతో పాటు అదనంగా 50 లక్షల రూపాయల కమిషన్ ఇస్తానని రాసి ఉందంట. వెంటనే అర్జున్ ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగానికి తెలియజేశాడు. వెంటనే స్పందించిన బీసీసీఐ చర్యలకు ఉపక్రమించింది.
నేరపూరిత కుట్ర
మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్ ద్వారా నేరపూరిత కుట్రకు ఉద్దేశపూర్వకంగా జరిగిన ప్రయత్నమని బీసీసీఐ యాంటీ కరప్షన్ విభాగం గుర్తించింది. ఏసీయూ ఫిర్యాదు మేరకు అనుమానిత వ్యక్తి, అతని సహచరులపై పలు కేసులు నమోదు చేసినట్టు సౌత్ జోన్ డీసీపీ నిపున్ అగర్వాల్ తెలిపారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాను వాడుతున్న వ్యక్తిని, అతని సహచరులను గుర్తించడానికి విచారణ జరుగుతుందని పేర్కొన్నారు. హర్దయాల్ సింగ్ చంపావత్ (రీజినల్ ఇంటిగ్రిటీ మేనేజర్, యాంటీ-కరప్షన్ యూనిట్, జైపూర్) లక్నోలో ఫిర్యాదు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు కావడంతో, లీగ్ ప్రతిష్ట గణనీయంగా దెబ్బతింది. ప్రస్తుతం పోలీసులు బీఎన్ఎస్ సెక్షన్లు 49, 56, 61, 62, 112, 318, 319, అలాగే పబ్లిక్ గాంబ్లింగ్ యాక్ట్ (సెక్షన్ 3), ఐటీ యాక్ట్ 66డీ కింద కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలను, కాల్‌లను మరొక ఫోన్లో రికార్డు చేసి పోలీస్‌లకు అధారాలగా బీసీసీఐ ఏసీయూ అప్పగించింది. లక్నో పోలీసులు ఆ వ్యక్తి గుర్తింపు, నెట్వర్క్, ఫిక్సింగ్ ప్రయత్నాల వెనుక ఉన్న అసలు కోణాన్ని బయటకు తీయడానికి సవివరమైన దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన ఢాకా ప్రీమియర్ లీగ్‌లోనూ మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం రేపింది. షైన్‌పుకూర్ క్రికెట్ క్లబ్, గుల్షన్ క్రికెట్ క్లబ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సబ్బీర్ అనుమానాస్పదంగా ఔట్ అయ్యాడు. ఈ విషయంపై అవినీతి నిరోధక విభాగం విచారణ చేపట్టింది. విచారణలో ఆ మ్యాచ్‌లో రెండు వింత అవుట్లు జరిగాయని గుర్తించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com