కుంబ్లేకే సాధ్యం కాలేదు.. బిన్నీ చేసి చూపించాడు..అయినా అవకాశాలు రాలేదు..!

Stuart Binny: అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ స్టువర్ట్ బిన్నీ. టీమిండియా తరపున 6 టెస్టులు, 14 వన్డేలు, 2 టీ20లు ఆడాడు. టీమిండియా తరపున వన్డేల్లో బెస్ట్ బౌలర్ గా ముద్ర వేసుకున్నాడు బిన్నీ. 2014లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డేలో అతడు అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఆ తర్వాత ఒకటి రెండు మ్యాచుల్లో కనిపించిన తర్వాత టీమిండియాకు ఆడే అవకాశాలు రాలేదు.
ఇక తాజాగా 37 ఏళ్ల ఈ క్రికెటర్ బిన్నీ అంతర్జాతీయ, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 'ఫస్ట్‌క్లాస్, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నాను. అత్యున్నత స్థాయిలో టీమ్‌ఇండియాకు ఆడటం నాకెంతో గర్వకారణం. అందుకు నేనెంతో సంతోషిస్తున్నా. నా కెరీర్ ఎదుగుదలకు ఉపయోగపడిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు' అని స్టువర్ట్ బిన్నీ తెలిపాడు.
స్పిన్నర్ అనిల్ కుంబ్లేకు సైతం ఇలాంటి రికార్డు సాధ్యం కానీ రికార్డ్ బిన్నీ నెలకొల్పాడు. వెస్టిండీస్‌పై 1993లో కుంబ్లే 12 పరుగులిచ్చి 6 వికెట్లు తీశాడు. అదే అత్యధిక రికార్డు. అయితే దానిని బిన్నీ బద్దలు కొట్టాడు. 2014లో ఢాకాలో బంగ్లాదేశ్‌తో జరిగిన వన్డే మ్యాచులో బిన్నీ కేవలం 4 పరుగులే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు
2014, జులైలో ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో బిన్నీ అరంగేట్రం చేశాడు. ఆ మ్యాచు రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేశాడు. ఏకైక అర్ధశతకం నమోదు చేశాడు. వెస్టిండీస్‌తో జరిగిన టీ20 మ్యాచులో బిన్నీ ఓ ఓవర్లో 31 పరుగులు ఇచ్చాడు. దాంతో అంతర్జాతీయ క్రికెట్లో అతడికి దారులు మూసుకుపోయాయి. విండీస్ బ్యాట్స్ మెన్ ఎవిన్ లూయిస్ బిన్నీ వేసిన ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు బాదడంతో అతని బౌలింగ్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత అతనికి టీమిండియాలో ఆడే అవకాశాలు రాలేదు. బిన్నీకి దాదాపుగా 95 ఫస్ట్‌క్లాస్ మ్యాచులు ఆడాడు.
India bowled out Bangladesh for 58 defending 105#StuartBinny - 4overs , 4 runs & 6 wickets .
— Shubham (@58off16) August 30, 2021
Stuart Binny has announced his retirement from all forms of cricket.
End of an era !!pic.twitter.com/bsvrEOPBKN
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com