vvs laxman: బీజేపీలోకి వివిఎస్ లక్ష్మణ్?

vvs laxman: భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ బీజేపీలోకి ఆయన చేరనున్నట్టు సమాచారం. ఇప్పటికే లక్ష్మణ్‌తో బీజేపీ జాతీయ నేతలు చర్చలు జరిపినట్టు చెపుతున్నారు. మరోవైపు ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురు క్రికెటర్లు బీజేపీలో ఉన్న సంగతి తెలిసిందే.
తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ... క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది. బీజేపీలో చేరేందుకు లక్ష్మణ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. త్వరలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో లక్ష్మణ్ బీజేపీ కండువా కప్పుకోబోతున్నారని సమాచారం. జీహెచ్ఎంసీ పరిధిలోని ఒక నియోజకవర్గం నుంచి లక్ష్మణ్ ను ఎన్నికల బరిలోకి దించాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. లక్ష్మణ్ చేరికపై త్వరలోనే బీజేపీ అధికారిక ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ 12, 2012లో లక్ష్మణ్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఆ తర్వాత ఐపీఎల్ ఫ్రాంఛైజీ డెక్కన్ ఛార్జర్స్ కు కెప్టెన్ గా వ్యవహరించారు ప్రస్తుతం సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మెంటార్ గా లక్ష్మణ్ వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో ఓ స్పోర్ట్స్ ఛానల్ కు వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com