ఇలాగే ఆడితే తప్పుకోవడం కాదు.. తప్పించేస్తారు ..!

ఐపీఎల్-2021 రెండో దశలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ జట్టు దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లిపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ మ్యాచ్ లో అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ విఫలమైన కోహ్లిపై పేరు చెప్పడినికి ఇష్టపడని ఓ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రాబోయే మ్యాచ్ లలో కోహ్లీ ప్రదర్శన ఇలాగే కొనసాగితే అతను తప్పుకోవడం కాదు.. యాజమాన్యమే అతన్ని జట్టు నుంచి తప్పిస్తుందని అంటూ వ్యాఖ్యానించాడు.
గతంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ దినేశ్ కార్తీక్‌ను, సన్‌రైజర్స్ హైదరాబాద్ డేవిడ్ వార్నర్‌ను మధ్యలోనే కెప్టెన్సీ బాధ్యతలను తప్పించిన విషయాన్ని గుర్తుచేశాడు. కోహ్లీ ఆట తీరు మారాలని, ఇలాగే కొనసాగితే మాత్రం అతన్ని ఆర్సీబీ మేనేజ్‌మెంట్ తప్పించడానికి కూడా వెనుకాడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్-2021 రెండో దశ మొదలయ్యే ముందు కోహ్లీ సంచలన నిర్ణయం తీసుకొని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఈ ఐపీఎల్ సీజనే ఆర్సీబీ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నట్టుగా వెల్లడించాడు. దీనికి కొద్దిరోజుల ముందు టీంఇండియా జట్టుకి టీ20 ప్రపంచకప్ తర్వాత పొట్టి ఫార్మాట్ కి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లుగా తెలిపాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com