Heath Streak: దిగ్గజ క్రికెటర్ హీత్ స్ట్రిక్ కన్నుమూత

జింబాబ్వే క్రికెట్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆ జట్టు మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్(Former Zimbabwe captain) హీత్ స్ట్రీక్( Heath Streak) కన్ను మూశాడు. క్యాన్సర్‌తో పోరాడుతూ 49 ఏళ్ల వయసులో హీత్ స్ట్రీక్ తుదిశ్వాస విడిచాడు. హీత్ స్ట్రీక్ సుదీర్ఘ కాలంగా కాలేయ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. ఆరోగ్యం విషమించి ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. హీత్‌స్ట్రిక్ మరణించిన విషయాన్ని అతడి భార్య నడైన్ స్ట్రీక్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.
నా జీవితంలో సగమైన.. నా అందమైన పిల్లల తండ్రి మమ్మల్ని విడిచి అందరాని లోకాలకు వెళ్లిపోయారంటూ నడైన్ తీవ్ర భావోద్వేగానికి గురైంది. తన చివరి రోజులను ఫ్యామిలీ, అత్యంత సన్నిహితులతో గడపాలని కోరుకున్నారని, స్ట్రీక్ మాతో గడిపిన క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనవని, స్ట్రీకీ మరో జన్మలో కూడా భార్య కావాలని కోరుకుంటున్నాని ఆమె పోస్ట్ చేశారు. పది రోజుల క్రితం క్రితం హీత్ స్ట్రీక్ మరణించాడంటూ సహచర ఆటగాడు హెన్రీ ఒలంగ అభిమానులను గందరగోళానికి గురిచేశాడు. ఆ తర్వాత మళ్లీ కొద్దిసేపటికే బతికే ఉన్నాడంటూ ట్విట్ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు. కానీ ఇప్పుడు నిజంగానే స్ట్రీక్ అందరిని విడిచి పెట్టి అందరాని లోకాలకు వెళ్లిపోయారు.
హీత్ స్ట్రీక్ చివరి రోజుల్లో చాలా బక్కగా ఎవరూ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. క్యాన్సర్ కారణంగా హీత్ స్ట్రీక్ మొహం పీక్కుపోయింది. చాలా రోజులుగా మహమ్మారితో పోరాడిన అతడు చివరకు మరణాన్ని ఆహ్వానించాడు. చివరి రోజుల్లో కుటుంబ సభ్యుల అతడిని కంటికి రెప్పలా చూసుకున్నారు. వారి వద్దే తుది శ్వాస విడిచాడు. హీత్ స్ట్రీక్ మరణంపై క్రీడా లోకం స్పందించింది. అతడి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపింది. 1990ల్లో ముక్కుపై, కింది పెదవికి తెల్లటి క్రీమ్‌ను రాసుకుని మైదానంలో హీత్ స్ట్రీక్ ప్రత్యేకంగా కనిపించేవాడు. బౌలింగ్ తో పాటు బ్యాటింగ్‌లో రాణిస్తూ జింబాబ్వే కెప్టెన్ స్థాయికి ఎదిగాడు.
1993-2005 మధ్య జింబాబ్వే తరఫున స్ట్రీక్ 65 టెస్టులు, 189 వన్డేలు ఆడాడు. కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత బంగ్లాదేశ్, జింబాబ్వే జట్లతో పాటు ఐపీఎల్‌లో కోల్‌కతా, గుజరాత్ లయన్స్‌కు కోచ్‌గా సేవలందించాడు. అవినీతి నిరోధక కోడ్‌ను ఉల్లంఘించినందుకు 2021, ఏప్రిల్‌లో అతడిపై ఐసీసీ ఎనిమిదేళ్ల నిషేధం విధించింది. కానీ, తాను ఎలాంటి ఫిక్సింగ్ కార్యకలాపాలకు పాల్పడలేదని స్ట్రీక్ చెప్పాడు. రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత కోచ్ గా కూడా మారాడు. ఐపీఎల్ జట్టు కేకేఆర్ కు బౌలింగ్ కోచ్ గా సేవలు అందించాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com