AUSTRALIA: పతాకస్థాయి నుంచి పాతాళం వరకు..

AUSTRALIA: పతాకస్థాయి నుంచి పాతాళం వరకు..
X
టీ 20 ప్రపంచకప్‌లో వరుస ఓటములు... సతమతమవుతున్న ఆస్ట్రేలియా జట్టు

ఐసీ­సీ టీ20 వర­ల్డ్‌­క­ప్ 2026లో ఆస్ట్రే­లి­యా జట్టు తీ­వ్ర సం­క్షో­భా­న్ని ఎదు­ర్కొం­టోం­ది. వరుస పరా­జ­యా­ల­తో కం­గా­రూల పరి­స్థి­తి సం­క్లి­ష్టం­గా మా­రిం­ది. సీ­ని­య­ర్ ఆట­గా­ళ్లు దూ­ర­మ­వ­డం, జట్టు­లో కీలక సభ్యు­లు ఫామ్ కో­ల్పో­వ­డం వంటి కా­ర­ణా­లు ఆసీ­స్ ప్ర­ద­ర్శ­న­పై తీ­వ్ర ప్ర­భా­వం చూ­పు­తు­న్నా­యి. ఒక­ప్పు­డు బల­మైన జట్టు­గా పే­రు­గాం­చిన ఆస్ట్రే­లి­యా ఇప్పు­డు గ్రూ­ప్ దశ­లో­నే ని­ష్క్ర­మిం­చే పరి­స్థి­తి­ని ఎదు­ర్కొం­టోం­ది. టో­ర్నీ ప్రా­రం­భా­ని­కి ముం­దే ఆస్ట్రే­లి­యా జట్టు­కు భారీ దె­బ్బ తగి­లిం­ది. స్టా­ర్ పే­స­ర్ మి­చె­ల్ స్టా­ర్క్ రి­టై­ర్మెం­ట్ ప్ర­క­టిం­చ­డం­తో బౌ­లిం­గ్ దళా­ని­కి నా­య­క­త్వ లోటు ఏర్ప­డిం­ది. అం­తే­కా­దు, జట్టు­లో ప్ర­ధాన బౌ­ల­ర్లైన పాట్ కమి­న్స్, హే­జి­ల్ వుడ్ ఫి­ట్‌­నె­స్ సమ­స్య­ల­తో టో­ర్నీ­కి దూ­ర­మ­య్యా­రు. స్క్వా­డ్ ప్ర­క­టన చి­వ­రి రో­జున కమి­న్స్ తప్పు­కో­వ­డం, ఆ వెం­ట­నే హే­జి­ల్‌­వు­డ్ కూడా రూ­ల్డ్ అవు­ట్ కా­వ­డం ఆసీ­స్‌­కు పె­ద్ద షా­క్‌­గా మా­రిం­ది. ఈ ము­గ్గు­రు లే­కుం­డా ఆస్ట్రే­లి­యా బౌ­లిం­గ్ బల­హీ­నం­గా మా­రిం­ది.

గ్రూ­ప్–బీలో ఆడు­తు­న్న ఆస్ట్రే­లి­యా తొలి మ్యా­చ్‌­లో ఐర్లాం­డ్‌­పై 67 పరు­గుల తే­డా­తో ఘన వి­జ­యం సా­ధిం­చి శు­భా­రం­భం చే­సిం­ది. ఆ మ్యా­చ్‌­లో బ్యా­టిం­గ్, బౌ­లిం­గ్ వి­భా­గా­లు సమ­న్వ­యం­గా రా­ణిం­చా­యి. దీం­తో ఆసీ­స్ మళ్లీ పాత పుం­జా­న్ని అం­దు­కుం­టుం­ద­న్న ఆశలు అభి­మా­ను­ల్లో కలి­గా­యి. అయి­తే ఆ ఆనం­దం ఎక్కు­వ­కా­లం ని­ల­వ­లే­దు. తర్వా­తి మ్యా­చ్‌­లో జిం­బా­బ్వే చే­తి­లో 23 పరు­గుల తే­డా­తో ఆస్ట్రే­లి­యా ఓట­మి­పా­లైం­ది. 2007 టీ20 వర­ల్డ్‌­క­ప్‌­లో ఆసీ­స్‌­కు షా­కి­చ్చిన జిం­బా­బ్వే మరో­సా­రి అదే సన్ని­వే­శా­న్ని పు­న­రా­వృ­తం చే­సిం­ది. కీలక సమ­యం­లో ఆసీ­స్ బ్యా­టిం­గ్ వి­ఫ­ల­మ­వ­డం­తో లక్ష్యా­న్ని చే­ధిం­చ­లే­క­పో­యిం­ది. ఈ ఓటమి జట్టు ఆత్మ­వి­శ్వా­సా­న్ని దె­బ్బ­తీ­సిం­ది. డూ ఆర్ డై మ్యా­చ్‌­గా భా­విం­చిన శ్రీ­లంక పో­రు­లో కూడా ఆసీ­స్‌­కు ని­రా­శే ఎదు­రైం­ది.

ఆస్ట్రే­లి­యా తన చి­వ­రి లీగ్ మ్యా­చ్‌­ను ఒమ­న్‌­తో ఆడ­నుం­ది. ఒమన్ పై భారీ వి­జ­యం సా­ధిం­చ­డం మా­త్ర­మే ఆసీ­స్‌­కు మి­గి­లిన మా­ర్గం. అయి­న­ప్ప­టి­కీ, ఇతర జట్ల ఫలి­తా­ల­పై కూడా వారి భవి­ష్య­త్ ఆధా­ర­ప­డి ఉంది. ము­ఖ్యం­గా ఫి­బ్ర­వ­రి 17న జర­గ­ను­న్న జిం­బా­బ్వే–ఐర్లాం­డ్ మ్యా­చ్ కీ­ల­కం­గా మా­రిం­ది. ఆ మ్యా­చ్‌­లో జిం­బా­బ్వే గె­లి­స్తే ఆసీ­స్ దా­దా­పు టో­ర్నీ నుం­చి ని­ష్క్ర­మిం­చి­న­ట్టే. ఒక­వేళ జిం­బా­బ్వే ఐర్లాం­డ్, శ్రీ­లంక చే­తి­లో భారీ తే­డా­తో ఓడి­పో­యి, అదే సమ­యం­లో ఆస్ట్రే­లి­యా ఒమ­న్‌­పై పె­ద్ద వి­జ­యం సా­ధి­స్తే పరి­స్థి­తి మారే అవ­కా­శం ఉం­టుం­ది. అప్పు­డు రన్‌­రే­ట్ ఆధా­రం­గా ఆసీ­స్ సూ­ప­ర్–8 దశకు చేరే అవ­కా­శ­ముం­టుం­ది. అయి­తే అది కష్ట­సా­ధ్య­మైన సమీ­క­ర­ణ­మే.

కంగారులేనా...?

మొ­త్తం మీద చూ­స్తే, ఈ టీ20 వర­ల్డ్‌­క­ప్‌­లో ఆస్ట్రే­లి­యా ప్ర­యా­ణం ఆశిం­చిన వి­ధం­గా సా­గ­డం లేదు. బల­మైన బౌ­లిం­గ్ త్ర­యం లే­క­పో­వ­డం, కీలక సం­ద­ర్భా­ల్లో బ్యా­టిం­గ్ వై­ఫ­ల్యం జట్టు­ను తీ­వ్రం­గా దె­బ్బ­తీ­సిం­ది. వరుస ఓట­ము­ల­తో జట్టు మా­న­సి­కం­గా కూడా ఒత్తి­డి­ని ఎదు­ర్కొం­టోం­ది. ఇక మి­గి­లిన మ్యా­చ్‌­ల్లో అద్భుత ప్ర­ద­ర్శన చేసి, ఇతర జట్ల ఫలి­తా­లు అను­కూ­లి­స్తే­నే ఆసీ­స్‌­కు సూ­ప­ర్–8 దశలో చోటు దక్కు­తుం­ది. క్రి­కె­ట్ ప్ర­పం­చా­న్ని ఆశ్చ­ర్య­ప­రి­చే­లా ఒక­ప్పు­డు అప్ర­తి­హ­తం­గా ని­లి­చిన ఆస్ట్రే­లి­యా ఇప్పు­డు గ్రూ­ప్ దశ­లో­నే ఎలి­మి­నే­ష­న్ అం­చున ని­ల­వ­డం వి­శే­షం. చి­వ­రి మ్యా­చ్, అలా­గే జిం­బా­బ్వే–ఐర్లాం­డ్ పోరు ఆసీ­స్ భవి­ష్య­త్‌­ను ని­ర్ణ­యిం­చ­ను­న్నా­యి. అభి­మా­ను­లు మా­త్రం చి­వ­రి వరకు ఆశలు వద­ల­కుం­డా జట్టు­కు మద్ద­తు­గా ని­లు­స్తు­న్నా­రు. ప్రస్తుతం కంగారులు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.

Tags

Next Story