క్రీడలు

గంగూలీని పరామర్శించిన సీఎం మమతా బెనర్జీ!

టీమ్‌ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురయ్యారయ్యారు. దీంతో ఆయనను కోల్ కతాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

గంగూలీని పరామర్శించిన సీఎం  మమతా బెనర్జీ!
X

టీమ్‌ ఇండియా మాజీ సారథి, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ స్వల్ప గుండెపోటుకు గురయ్యారయ్యారు. దీంతో ఆయనను కోల్ కత్తాలోని వుడ్ ల్యాండ్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఎస్‌ఎస్‌కేఎం కార్డియాలజిస్టు డాక్టర్‌ సరోజ్‌ మొండల్‌ నేతృత్వంలోని ముగ్గురు వైద్యుల బృందం దాదాకు కరోనరీ యాంజియోగ్రామ్‌ నిర్వహించారు. ఉదయం కసరత్తులు చేస్తుండగా ఛాతిలో నొప్పిరావడంతో ఆస్పత్రిలో చేర్పించారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆస్పత్రికి చేరుకొని గంగూలీని పరామర్శించారు. ఆయనకు అందిస్తున్న చికిత్సపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు గంగూలీ త్వరగా కోలుకోవాలని క్రికెటర్లు, అభిమానులు కోరుకుంటున్నారు. సోషల్‌ మీడియా వేదికగా సందేశాలు పెడుతున్నారు. దాదా వేగంగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.


Next Story

RELATED STORIES