GAMBHIR: టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్

టీమిండియా కొత్త హెడ్ కోచ్‌గా ఎవరు వస్తారన్న ఉత్కంఠకు తెరపడింది. మాజీ ఓపెనర్, కామెంటేటర్ గౌతం గంభీర్‌ను భారత ప్రధాన కోచ్‌గా నియమిస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. అందరి అంచనాలను నిజం చేస్తూ భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్‌ను నియమించారు. ఇప్పటివరకూ హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ స్థానంలో గంభీర్‌ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ వెల్లడించింది. భారత్ 2011 వన్డే ప్రపంచకప్ నెగ్గడంలో ఓపెనర్‌గా గౌతం గంభీర్ కీలక పాత్ర పోషించాడు. శ్రీలంక పర్యటనతో కోచ్‌గా గంభీర్ ప్రస్థానం ప్రారంభం కానుంది. జులై 27న మొదలయ్యే శ్రీలంక పర్యటనలో టీమ్‌ఇండియా మూడు టీ20లు, మూడు వన్డేలు ఆడుతుంది.
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌ను నియమించినట్లు బీసీసీఐ ప్రకటించింది. అంతా ఊహించినట్లుగానే టీమిండియా మాజీ క్రికెటర్ గంభీర్‌కు భారత క్రికెట్ టీమ్ బాధ్యతల్ని అప్పగించారు. ఈ విషయాన్ని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. రాహుల్ ద్రావిడ్ పదవీకాలం టీ20 వరల్డ్ కప్ తో ముగియగా.. బీసీసీఐ గంభీర్ వైపు మొగ్గు చూపింది. త్వరలో శ్రీలంకతో జరగనున్న మూడు వన్డేలు, 3 టీట్వంటీల సిరీస్ నుంచి గంభీర్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. జులై 27న ఈ సిరీస్ ప్రారంభం కానున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ పదవీకాలం ముగియనుందని కొత్త కోచ్ కోసం మే 13న బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానించింది. అయితే రాహుల్ ద్రావిడ్ శిక్షణలో టీమిండియా ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024 విజేతగా నిలిచింది. 17 ఏళ్ల తరువాత పొట్టి ప్రపంచ కప్ ను భారత్ ముద్దాడింది. గత ఏడాది జరిగిన వన్డే వరల్డ్ కప్ లో ఫైనల్లో ఆసీస్ చేతిలో ఓటమితో భారత్ రన్నరప్ తో సరిపెట్టుకుంది. ఇంగ్లాండ్ లో జరిగిన ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ లో భారత్ రన్నరప్‌గా నిలిచింది.
గంభీర్ టీమ్‌ఇండియా తరఫున 58 టెస్టులు, 147 వన్డేలు, 37 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన జట్లలో అతను సభ్యుడు. ఆ రెండు టోర్నీల ఫైనల్స్‌లో గంభీరే టాప్‌స్కోరర్. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 2012, 2014లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు టైటిళ్లను అందించాడు. 2024లో ఐపీఎల్ టైటిల్ నెగ్గిన కోల్‌కతాకు మెంటర్‌గా గంభీర్ తన కోచింగ్ సమర్థతనూ నిరూపించుకున్నాడు. ద్రవిడ్ కోచ్‌గా 12 కోట్ల రూపాయలు అందుకోగా గంభీర్ దానికన్నా ఎక్కువ జీతమే పొందనున్నట్లు తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com