Hockey India: మహిళల జట్టు ప్రకటన, కెప్టెన్‌గా సవిత

20 మంది క్రీడాకారిణులతో కూడిన భారత హాకీ జట్టును హాకీ ఇండియా ప్రకటించింది. మహిళల జట్టు జర్మనీలో పర్యటించనుంది. దీంతో పాటుగా స్పెయిన్‌లో జరగనున్న 100వ స్పెయిన్ హాకీ సమాఖ్య అంతర్జాతీయ టోర్నమెంట్‌లో కూడా ఇదే జట్టు తలపడనుంది. ఈ పర్యటన సెప్టెంబర్‌లో జరగనున్న ఆసియా క్రీడల సన్నద్ధతలో భాగమే. భారత జట్టుకు గోల్‌కీపర్ సవిత సారథ్యం వహించనుంది.
జులై 16 నుంచి 19 వరకు సాగే జర్మనీ పర్యటనలో 1 టెస్ట్ మ్యాచ్ చైనాతో, మరో 2 మ్యాచ్‌లు జర్మనీతో టెస్ట్‌లు ఆడనుంది.అనంతరం స్పెయిన్ వెళ్లనున్న జట్టు అక్కడ థెరెస్సాలో జులై 25 నుంచి 30 వరకు జరిగే మ్యాచుల్లో దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, స్పెయిన్‌తో తలపడనుంది.
భారత జట్టుకు గోల్‌కీపర్ సవిత కెప్టెన్ కాగా, దీప్ గ్రేస్ ఎక్కా వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. బిచుదేవి ఖరిబామ్ సెకండ్ గోల్ కీపర్‌గా జట్టులోకి ఎంపికైంది. భారత జట్టు డిఫెండర్లుగా ఎక్కా, నిక్కి ప్రధాన్, ఇషికా చౌదరి, ఉదిత, సుహిలా చానులు జట్టులోకి వచ్చారు. మిడ్ ఫీల్డ్ విభాగంలో నిషా, మోనికా, సలీమా తెతె, నేహా, నవ్‌నీత్ కౌర్, సోనికా, బల్జీత్ కౌర్, వైష్ణవి విట్టల్ ఫాల్కే, జ్యోతీ ఛత్రీ వంటి క్రీడాకారుణలతో బలంగా కనిపిస్తోంది. గోల్స్ సాధించే ఫార్వర్డ్ విభాగంలో స్ట్రైకర్ వందన కటారియా, లాల్రెసియామి, సంగీత కుమారీ, దీపకాలు జట్టులో ఎంపికయ్యారు
జట్టు ఎంపికపై కోచ్ జానెక్ షాప్‌మాన్ మాట్లాడుతూ... బలమైన జట్లతో మన జట్టు సత్తా, ప్రతిభ చూపడానికి మరోసారి స్పెయిన్, జర్మనీ పర్యటనలు తోడ్పడతాయన్నారు. అలాగే ఆసియా క్రీడలకు కూడా సన్నద్ధత ఉంటుందన్నారు. క్రీడాకారిణులు అత్యుత్తమ స్థాయిలో శిక్షణ పొందుతూ, అవిశ్రామంగా శ్రమిస్తూ నైపుణ్యాలు మెరుగు పరుచుకుంటున్నారని అన్నారు. గత పర్యటన, శిక్షణలో నేర్చుకున్న అంశాలు, వ్యూహాలను జట్టుగా అమలుచేయడంపై మేం దృష్టి సారించాం అని వెల్లడించింది. రానున్న ఆసియా క్రీడలకు ఈ టోర్నీలు చాలా కీలకం. ఆసియా క్రీడలకు ముందు ఈ టోర్నీ ఉన్నందున జట్టు బలాలు, బలహీనతలపై దృష్టిపెట్టి వాటిని మెరుగుపరచుకునే అవకాశం లభిస్తుందని వెల్లడించింది.
భారత జట్టు:
గోల్ కీపర్లు: సవిత (కెప్టెన్), బిచు దేవి ఖరీబామ్
డిఫెండర్లు: దీప్ గ్రేస్ ఎక్కా (వైస్ కెప్టెన్), నిక్కీ ప్రధాన్, ఇషికా చౌదరి, ఉదిత, సుశీల చాను పుఖ్రంబం,
మిడ్‌ఫీల్డర్లు: నిషా, మోనికా, సలీమా టెటే, నేహా, నవనీత్ కౌర్, సోనిక, బల్జీత్ కౌర్, వైష్ణవి విఠల్ ఫాల్కే, జ్యోతి ఛత్రి
ఫార్వర్డ్‌లు: లాల్‌రెమ్సియామి, వందనా కటారియా, సంగీత కుమారి, దీపిక
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com