IPL: వాషింగ్టన్ సుందర్‌పై స్పందించిన గూగుల్ సీఈఓ

ఐపీఎల్ 2025లో తొలి మ్యాచులో గుజరాత్ టైటాన్స్ పరాజయం పాలైంది. ఈ మ్యాచులో గుజరాత్ తరపున బరిలోకి దిగే అవకాశం వాషింగ్టన్ సుందర్ కు దక్కలేదు. దీనిపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్పందించాడు. టీమిండియాలో సుందర్ చోటు దక్కించుకున్నాడని... కానీ ఐపీఎల్‌లో ఫైనల్ XIలో మాత్రం అవకాశం దొరకకపోవడం మిస్టరీగా ఉందని ఓ అభిమాని పోస్ట్ చేశాడు. దీనికి పిచాయ్ తనకు ఇదే ఆశ్చర్యంగా అనిపిస్తోందని రిప్లై ఇచ్చారు.
ద్రవిడ్‌ను గంభీర్ అనుసరించాలి: గవాస్కర్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా నిలిచిన భారత జట్టుకు BCCI రూ.58 కోట్లను నజరానా ప్రకటించింది. హెడ్ కోచ్‌కు రూ.3 కోట్లు, సహాయక కోచింగ్ సిబ్బందికి రూ.50 లక్షల చొప్పున దక్కనుంది. దీనిపై దిగ్గజ క్రికెటర్ గవాస్కర్ స్పందించారు. ‘గత ఏడాది టీ20 ప్రపంచకప్ గెలిచినప్పుడు కోచ్ ద్రవిడ్ ప్రైజ్‌మనీని వెనక్కి ఇచ్చి సహచరులకు సమంగా పంచాలన్నారు. ప్రస్తుత కోచ్ గంభీర్ దీనిపై స్పందించడం లేదు. ద్రవిడ్‌ను గంభీర్ అనుసరించాలి’ అని అన్నారు.
జోఫ్రా ఆర్చర్ ఆసక్తికర పోస్ట్
ప్రపంచంలోనే అత్యంత డేంజరస్ బౌలర్‌లలో ఒకరైన జోఫ్రా ఆర్చర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికరమైన స్టోరీ పెట్టాడు. ఇటీవల సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లో 76 పరుగులు ఇచ్చి దారుణంగా ఫెయిల్ అయ్యాడు. దీంతో చాలామంది క్రికెట్ ఎక్స్‌పర్ట్స్, ఫ్యాన్స్ షాక్ కాగా మరికొందరు ట్రోల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆర్చర్ డోంట్ బీ ఎఫ్రాయిడ్ టు ఫెయిల్ అనే స్టోరీని పెట్టాడు.
రోహిత్‌కు తెలిసే సెలెక్ట్ చేయలేదు: సిరాజ్
టీమిండియా స్పీడ్ గన్ మహ్మద్ సిరాజ్ కెప్టెన్ రోహిత్ శర్మపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటార్క్షన్‌లో సిరాజ్ మాట్లాడుతూ.. ' ఛాంపియన్స్ ట్రోఫీ దుబాయ్‌లో జరిగింది, అక్కడి పిచ్‌లు స్పిన్నర్లకు సహకరిస్తాయి. అందుకే స్పీడ్ బౌలర్లను ఎక్కువగా టీమ్‌లోకి తీసుకోలేదు. ఈ నిర్ణయంతోనే భారత్ ట్రోఫీ గెలిచింది. రోహిత్‌కు ఎప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోవాలో కరెక్ట్‌గా తెలుసు' అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com