WPL: బెంగళూరు ఘన విజయం

ఉమెన్ ప్రీమియర్ లీగ్‌ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. భారీ లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించి సరికొత్త రికార్డును సృష్టించింది. . 201 పరుగుల లక్ష్యాన్ని 18.3 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి బెంగళూరు ఛేదించింది. తొలి పోరులో ఆర్‌సీబీ 6 వికెట్ల తేడాతో గుజరాత్ జెయింట్స్ జట్టుపై ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. కెప్టెన్ ఆష్లీ గార్డ్‌నర్ (79 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, బెత్ మూనీ (56) అర్ధశతకాలతో రాణించారు. బెంగళూరు బౌలర్లలో రేణుక 2 వికెట్లు తీయగా.. కణిక, ప్రేమ, జార్జియా తలో వికెట్ పడగొట్టారు. అనంతరం 202 భారీ పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RCB మరో 9 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. బ్యాటింగ్‌లో రిచా గోష్ 64, పెర్రీ 57, కనిక 30 పరుగులు చేశారు. గుజరాత్ బౌలర్లలో ఆష్లీ గార్డనర్ 2, డియాండ్రా డాటిన్, సయాలీ తలో వికెట్ తీశారు.
నేడు ఢిల్లీ, ముంబై మ్యాచ్
మహిళల ప్రీమియర్ లీగ్-2025లో భాగంగా నేడు(శనివారం) ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్ తల పడనున్నాయి. గుజరాత్‌లోని వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. మరి ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలుస్తుందో కామెంట్ చేయండి. కాగా.. WPL తొలి మ్యాచ్‌లో RCB ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే.
ప్రశంసలు ఎక్కువే: స్మృతి
WPL-2025 మూడో సీజన్ లో బెంగళూరు ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలోనే ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమ ప్రదర్శనకు అభిమానుల సాయం ఎంతో ఉంటుందని తెలిపింది. మిగత టీమ్ లతో పోలీస్తే బెంగుళూరు జట్టుపై వచ్చే ప్రశంసలు, విమర్శలు ఎక్కువగా ఉంటాయని ఆమె తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com