వావ్ గ్రేట్.. నీరజ్ పేరుంటే పెట్రోల్ ఫ్రీ..

దేశమంటే ప్రేమ.. దేశపతాకాన్ని అంతర్జాతీయ క్రీడా ప్రాంగణంలో ఎగుర వేసిన ఆ ఆటగాడంటే మరింత ప్రేమ.. జావెలిన్ త్రోలో స్వర్ణ పతకాన్ని సాధించిన నీరజ్ పేరు మారు మ్రోగిపోతోతంది.ఈ క్రమంలో గుజరాత్‌లోని ఒక పెట్రోల్ పంప్ యజమాని నిరజ్ పట్ల తన ప్రత్యేక అభిమానాన్ని చాటుకోవాలనుకున్నారు.
భరూచ్‌లోని పెట్రోల్ పంప్ యజమాని అయూబ్ పఠాన్, నీరజ్ పేరున్న వారికి రూ .501 వరకు ఉచితంగా పెట్రోల్ అందిస్తామని ప్రకటించారు. అంతే పెట్రోల్ బంక్ నీరజ్‌లతో నిండిపోయింది. దేశంలో చాలా మంది ప్రజలు ఈ సంవత్సరం ఒలింపిక్ విజయాలు జరుపుకున్నారు.
అథ్లెట్లు టోక్యో నుండి తిరిగి వచ్చిన తర్వాత అద్భుతమైన బహుమతులు అందుకున్నారు. నీరజ్ పేరుతో ఉన్న ID కార్డు చూపిస్తే రూ.501 పెట్రోల్ ఉచితంగా వాహనాల్లో నింపుతున్నారు. యజమాని అయూబ్ పఠాన్ ఒలింపిక్స్‌లో భారతదేశం సాధించిన విజయాన్ని తనదైన ప్రత్యేక శైలిలో జరుపుకోవాలని అనుకుంటున్నట్లు చెప్పారు.
నీరజ్ బంగారు పతకం గెలవడం మాకు చాలా గర్వంగా ఉంది. మేము ఈ రెండు రోజుల పథకాన్ని ఆదివారం ప్రారంభించాము అని పెట్రోల్ పంప్ యజమాని భరూచ్ అన్నారు. ఇప్పటి వరకు 30మంది నీరజులకు పెట్రోల్ ఉచితంగా ఇచ్చినట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com