గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌..

గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌..
ఐపిఎల్ 2024కి ముందు జట్టుకు నాయకత్వం వహించడానికి గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది.

ఐపిఎల్ 2024కి ముందు జట్టుకు నాయకత్వం వహించడానికి గుజరాత్ టైటాన్స్ శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌గా నియమించింది. గుజరాత్ టైటాన్స్ క్రికెట్ డైరెక్టర్ మిస్టర్ విక్రమ్ సోలంకి మాట్లాడుతూ, “శుభ్‌మన్ గిల్‌ గత రెండేళ్లుగా ఆటలో అత్యున్నత స్థాయిలో నిలదొక్కుకోవడంతోపాటు జట్టు విజయానికి తన వంతు కృషిని అందిస్తున్నాడు.

అతను బ్యాటర్‌గా మాత్రమే కాకుండా క్రికెట్‌లో నాయకుడిగా కూడా పరిణతి చెందడం మనం చూశాం. మైదానంలో అతడు అందించిన సహకారం వలన గుజరాత్ టైటాన్స్ బలీయమైన శక్తిగా ఎదగడానికి తోడ్పడింది. అతని పరిణితి, నైపుణ్యం మైదానంలో స్పష్టంగా కనిపిస్తుంది. శుభ్‌మాన్ లాంటి యువ నాయకుడితో కొత్త ప్రయాణం ప్రారంభించడానికి చాలా సంతోషిస్తున్నాము ” అని తెలిపారు.

ఈ ప్రకటనపై శుభ్‌మాన్ గిల్ మాట్లాడుతూ, “గుజరాత్ టైటాన్స్‌కు కెప్టెన్సీని స్వీకరించడం పట్ల నేను సంతోషిస్తున్నాను. జట్టును నడిపించడానికి నాపై నమ్మకం ఉంచినందుకు ఫ్రాంచైజీకి ధన్యవాదాలు. మేము రెండు అసాధారణ సీజన్‌లను మా అద్భుతమైన క్రికెట్ బ్రాండ్‌తో జట్టును నడిపించడానికి నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు తిరిగి వెళ్ళిన తర్వాత గుజరాత్ టైటాన్స్ కు గిల్‌ను కెప్టెన్‌గా నియమించడం జరిగింది. భారతీయ ఆల్ రౌండర్ GTతో రెండు సంవత్సరాలు గడిపాడు.

2022లో GT యొక్క అరంగేట్రం సీజన్‌లో హార్దిక్ ఒక అద్భుత ప్రారంభాన్ని అందించాడు. జట్టుకు ట్రోఫీని అందించాడు. రెండవ సీజన్‌లో మాత్రం జీటీ టీమ్ రన్నరప్ గా నిలిచింది.

Tags

Read MoreRead Less
Next Story