Khel Ratna: గుకేష్, మనుకు ఖేల్‌రత్న అవార్డులు

చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేష్, డబుల్ ఒలింపిక్ పతక విజేత మను భాకర్‌లను ప్రతిష్ఠాత్మక ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డులు వరించాయి. 2024కు సంబంధించిన క్రీడా పురస్కారాల జాబితాను క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. అత్యున్నత క్రీడా పురస్కారం ఖేల్‌రత్నకు నలుగురిని, అర్జున అవార్డుకు 32 మందిని ఎంపిక చేశారు. గుకేష్, మనుతోపాటు భారత హాకీ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్‌లు కూడా ఖేల్‌రత్నకు ఎంపికయ్యారు. మను బాకర్ (షూటింగ్), హర్మన్ ప్రీత్ సింగ్ (హాకీ), ప్రవీణ్ కుమార్ (పారా అథ్లెట్), డి. గుకేశ్ (చెస్) ఈ అవార్డులకు ఎంపికయ్యారు. అథ్లెట్లు జ్యోతి యర్రాజి, దీప్తి జీవాంజిలకు అర్జున దక్కాయి. ఈసారి అర్జునకు ఎంపికైన వారిలో 17 మంది పారా అథ్లెట్లు ఉన్నారు. ముగ్గురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. ఈ నెల 17న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో అవార్డులను ప్రదానం చేయనున్నారు. ఖేల్‌రత్న విజేతలకు జ్ఞాపికతోపాటు రూ. 25 లక్షలు, అర్జున అవార్డీలకు రూ. 15 లక్షలతోపాటు అర్జునుడి ప్రతిమను బహూకరించనున్నారు.
ఖేల్‍రత్న అవార్డు.. స్పందించిన గుకేష్ తల్లి
ఇటీవల ప్రపంచ చెస్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్‌కు ప్రతిష్టాత్మక ఖేల్ రత్న అవార్డును కేంద్రం ప్రకటించింది. గుకేష్‌కు ఖేల్ రత్న అవార్డు రావడంపై అతడి తల్లి పద్మ కుమారి స్పందించారు. తన కొడుకు అతి చిన్న వయస్సులో ఖేల్ రత్న అవార్డు రావడం ఆశ్చర్యానికి గురి చేసిందన్నారు. అలాగే తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఒక తల్లిగా తనకు ఇంతకు మించిన ఆనందం మరొకటి ఉండదని పద్మ తెలిపారు.
మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న
గుకేష్ (చెస్)
మను భాకర్ (షూటింగ్)
హర్మన్‌ప్రీత్ సింగ్ (హాకీ)
ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్)
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com