IPL: ధోనీని చూసి షాక్ అయిన హర్భజన్

IPL: ధోనీని చూసి షాక్ అయిన హర్భజన్
X
43 ఏళ్ల వయసులో ధోనీ ఫిట్ నెస్ చూసి షాక్ అయిన టర్బోనేటర్

భారత మాజీ కెప్టెన్ MS ధోనీపై మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 43 ఏళ్ల వయసులోనూ ధోనీ ఫిట్‌నెస్ చూసి షాకైనట్లు చెప్పారు. ఓ వివాహ వేడుకలో.. ‘ఈ వయసులో ఇలా ఉండటానికి ఏం చేస్తున్నావు. కష్టమే కదా అని అన్నాను. ఆటలో సంతోషం పొందుతున్నానని, ఆడాలని ఉంది కాబట్టే ఆడుతున్నానని ధోనీ చెప్పాడు. రోజూ 3 గంటలపాటు కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు’ అని హర్భజన్ తెలిపారు.

ఇదొక గౌరవం: రహానే

కోల్‌కతా నైట్ రైడర్స్ ఐపీఎల్ 2025కి కెప్టెన్‌గా అజింక్యా రహానేని నియమించింది. మెగా వేలంలో రూ.1.5 కోట్లకు కొనుగోలు చేసిన రహానే.. ఇదొక గౌరవంగా చెప్పారు. అయితే అతను ఇంతకు ముందు కోల్ కత్తా జట్టులో భాగంగా ఉండే వారు. కానీ మొదటిసారి జట్టు బాధ్యతలు చేపట్టబోతున్నారు.. గత సీజన్‌లో శ్రేయాస్‌ అయ్యర్‌ సారథ్యంలో కేకేఆర్‌ టైటిల్‌ గెలిచినా జట్టు అతడిని కెప్టెన్సీ నుంచి తొలగించడం గమనార్హం.

పృథ్వీ షాకు పంజాబ్ క్రికెటర్ కీలక సూచనలు

పృథ్వీ షాకు పంజాబ్ కింగ్స్ బ్యాటర్ శశాంక్ సింగ్ కీలక సూచనలు చేశారు. కెరీర్ లో డేంజర్ స్టేజ్ లో ఉన్న అతడికి మద్దతుగా నిలుస్తూ, కొన్ని సలహాలు ఇచ్చాడు. ' షృథ్వీ షా తన ఆట పట్ల కొన్ని విషయాలను పాటించాలి. రాత్రి 11 గంటలకు కాకుండా 10 గంటలకు నిద్రపోవాలి. డైట్ ను మార్చుకోవాలి. మరింత మెరుగుపరుచుకోవాలి. అతడు తన తప్పిదాలను అంగీకరించి వాటిని మార్చుకుంటే మంచి భవిష్యత్ ఉంది' అని శశాంక్ అన్నాడు.

చెన్నై కెప్టెన్‌పై తుషార్ దేశ్‌పాండ్ ప్రశంసలు

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ రుతురాజ్‌ గైక్వాడ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు తుషార్ దేశ్‌పాండే ప్రశంసించారు. ఈ సందర్భంగా తుషార్ మాట్లాడుతూ.. రుతురాజ్‌ను చెన్నై కెప్టెన్‌గా ప్రకటించినప్పుడు తాను చెన్నై జట్టులో సభ్యుడిగా ఉన్నానని తెలిపారు. కఠోర శ్రమే అతడిని ఈ రోజు ఉన్నత స్థానానికి చేర్చిందని పొడిగారు. ఈ ఏడాది రుతురాజ్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు.

Tags

Next Story