Harbhajan Singh : 'రైతు బిడ్డల కోసం నా జీతం' : హర్భజన్ సింగ్

Harbhajan Singh : క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరుపున రాజ్యసభ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో భజ్జీ కీలకమైన ప్రకటన చేశాడు... రైతుల కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాజ్యసభ ఎంపీగా తనకి వచ్చే జీతాన్ని రైతుల కుమార్తెల చదువు, సంక్షేమం కోసం వినియోగించనున్నట్లు వెల్లడించాడు. దేశాన్ని మరింత ఉన్నతంగా తీర్చిందిద్దేందుకే ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలిపాడు భజ్జీ.. దేశం కోసం ఏదైనా చేస్తానని స్పష్టం చేశాడు. చివర్లో జై హింద్ అని కాప్షన్ పెట్టాడు. హర్భజన్ తీసుకున్న ఈ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.
As a Rajya Sabha member, I want to contribute my RS salary to the daughters of farmers for their education & welfare. I've joined to contribute to the betterment of our nation and will do everything I can. Jai Hind 🇮🇳🇮🇳
— Harbhajan Turbanator (@harbhajan_singh) April 16, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com