గాయం కారణంగా న్యూజిలాండ్ మ్యాచ్ లో పాల్గొనని హార్ధిక్..

ధర్మశాలలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్‌కు హార్దిక్ పాండ్యా దూరమైనట్లు బీసీసీఐ ధృవీకరించింది. భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా చీలమండ గాయానికి గురయ్యాడు. వైద్య బృందం అతనికి విశ్రాంతి తీసుకోవాలని సూచించింది. లక్నోలో ఇంగ్లండ్‌తో జరిగే తదుపరి మ్యాచ్‌కు ముందు హార్దిక్ భారత జట్టులో చేరనున్నాడు
పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతని ఎడమ చీలమండకు గాయమైంది. ఆల్‌రౌండర్‌ను విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు. BCCI వైద్య బృందం అతడిని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అతను అక్టోబర్ 20న జట్టుతో కలిసి ధర్మశాలకు విమానంలో వెళ్లట్లేదని బీసీసీఐ పేర్కొంది. భారత్‌తో ఇంగ్లాండ్ ఆడే మ్యాచ్ కు నేరుగా జట్టులో చేరతాడు" అని BCCI ప్రకటన విడుదల చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com