Hardik Pandya: ముంబై ఇండియన్స్ ఎప్పటికీ నా గుండెల్లో ఉంటుంది.. హార్దిక్ పాండ్యా ఎమోషనల్ పోస్ట్..!

Hardik Pandya: 2022 ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం మెగా వేలానికి ముందు టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకి రిటైన్ ఆటగాళ్ల జాబితాలో చోటుదక్కలేదు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ హార్దిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పోస్టు చేశాడు. ముంబై ఇండియన్స్ తనని రిటైన్ చేసుకోకపోయినా ఆ టీం ఎప్పటికి తన గుండెల్లో ఉంటుందని చెప్పుకొచ్చాడు. ముంబైతో గడిపిన క్షణాలను జీవితాంతం గుర్తుచేసుకుంటానని అన్నాడు.
ఎంత గొప్ప బంధాలకైనా ముగింపు ఉంటుందని అంటుంటారు. కానీ, ముంబయి ఇండియన్స్ ఎప్పటికీ నా హృదయంలో ఉంటుందని అన్నాడు. కాగా ముంబై ఇండియన్స్ టీంతోనే హార్దిక్ పాండ్యా వెలుగులోకి వచ్చాడు. 2015నుంచి ఆ జట్టు తరుపున పాండ్యా ఆడుతున్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత పాండ్యా బౌలింగ్ చేయడం లేదు. బహుశా అందుకే అతన్ని రిటైన్ చేసుకోకపోవడానికి కారణమని తెలుస్తోంది.
ముంబై ఇండియన్స్ రిటైన్ చేసుకున్న నలుగురు ఆటగాళ్లలో కెప్టెన్ రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా మరియు సూర్యకుమార్ యాదవ్‌లు ఉన్నారు, వెస్టిండీస్‌కు చెందిన కీరన్ పొలార్డ్ మాత్రమే రిటైన్ చేయబడిన ఏకైక విదేశీ ఆటగాడు కావడం విశేషం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com