HarmanPreet Kaur: వికెట్లను బ్యాట్‌తో కొట్టిన హర్మన్ ప్రీత్ కౌర్

Harman Preet Kaur: భారత క్రికెట్ మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ విమర్శకుల నోళ్లకు పనిపెట్టింది. బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి వన్డేలో తన ప్రవర్తనతో ఐసీసీ(ICC) నుంచి చర్యలు ఎదుర్కొంది. అలాగే అంపైరింగ్ ప్రమాణాలపైనా తీవ్ర విమర్శలు చేసింది. హర్మన్ ప్రీత్ మ్యాచ్ ఫీజులో 75 శాతం కోత విధించిన ఐసీసీ, 3 డీమెరిట్ పాయింట్లు కూడా జతచేసింది. హర్మన్ చర్యలను భారత సీనియర్, మాజీ ఆటగాళ్లు ఖండిస్తున్నారు.
ఇదీ నేపథ్యం..
225 పరుగుల లక్ష్యఛేదనలో 14 పరుగులకే హర్మన్ ప్రీత్ కౌర్ ఎల్బీగా ఔటయింది. నిరాశ, కోపంలో వికెట్లను బ్యాట్‌తో కొట్టడమే కాకుండా, అంపైర్లను ఏదో అంటూ బంగ్లా అభిమానులకు సంజ్ణలు చేస్తూ పెవిలియన్ వెళ్లింది. తర్వాత ట్రోఫీ, అవార్డుల పంపిణీ కార్యక్రమంలోనూ వివాదాస్పదంగా ప్రవర్తించింది. మ్యాచ్ టై కావడంతో సిరీస్ కూడా 1-1తో సమం కావడంతో ఇరుజట్ల కెప్టెన్లు కలిసి ట్రోఫీని అందుకుని ప్రదర్శిస్తుండగా, అంపైర్లు కూడా రావాలి అన్నట్లుగా వారిని పిలిచింది.
ఇరుజట్లు కలిసి ఫోటో దిగే సమయంలోనూ వ్యంగ్యంగా చప్పట్లు కొడుతూ, ఏవో మాటలు అంటుండటంతో, బంగ్లాదేశ్ కెప్టెన్ నిగర్ సుల్తానా(Nigar Sulatana) తన జట్టు సభ్యులతో కలిసి మైదానాన్ని వీడి అసంతృప్తి వెల్లడించింది.
అంతకు ముందు హర్మన్ మాట్లాడుతూ అంపైరింగ్ నిర్ణయాలను తీవ్రంగా విమర్శించింది.
"ఇక్కడ పలు అంపైరింగ్ నిర్ణయాలు నమ్మశక్యంగా లేవు. అవి దారుణంగా ఉన్నాయి. మరోసారి బంగ్లాదేశ్ పర్యటనకు వచ్చేటపుడు వీటన్నింటినీ గుర్తుంచుకుని దానికి తగ్గట్లుగా సన్నద్ధమవుతాం" అంటూ వ్యంగ్యంగా వెల్లడించింది.
భారత్ సిరీస్‌లో చివరి వన్డే మ్యాచ్‌లో 225 పరుగుల ఛేదనలో మ్యాచ్‌ని టైగా ముగించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com