HENRY OLONGA: హెన్రీ ఒలాంగా... బోట్ క్లీనర్‌గా..

1990వ దశకంలో క్రికెట్ ఫాలో అయిన క్రికెట్ అభిమానులకు హెన్రీ ఒలాంగా పేరు సుపరిచితమే. ముఖ్యంగా 1998 షార్జాలో జరిగిన కోకా-కోలా కప్ ఫైనల్ జరిగిన మ్యాచ్‌ను ఎవరూ మరిచిపోలేరు. అప్పట్లో సచిన్ చేసిన శివ తాండవం క్రికెట్ చరిత్రలో ఓ మైలురాయిగా నిలిచింది. ఆ పైనల్లో యువ జింబాబ్వే ఫాస్ట్ బౌలర్ అయిన ఒలాంగా బౌలింగ్‌లో సచిన్ టెండూల్కర్ విశ్వరూపం చూపించాడు. ఆ ముక్కోణపు సిరీస్‌లో భారత్‌తో మ్యాచ్‌లో ఒలాంగా 4 వికెట్లు తీశాడు. టెండూల్కర్ వికెట్ తీశాక దూకుడుగా సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 13 పరుగుల తేడాతో ఓడింది. అదే సిరీస్ లో జింబాబ్వేతోనే జరిగిన ఫైనల్లో సచిన్ ప్రతీకారంతో చెలరేగిపోయాడు. కనికరం లేకుండా ఒలాంగాను చితక బాదాడు. 6 ఓవర్లలోనే ఈ పేసర్ 50 పరుగులు ఇచ్చుకున్నాడు. సచిన్ 92 బంతుల్లోనే అజేయంగా 124 పరుగులు చేశాడు. 197 పరుగుల లక్ష్యాన్ని భారత్ 30 ఓవర్లలోనే ఛేదించింది. ఒలాంగాపై సచిన్ చెలరేగిన తీరు అప్పట్లో పెద్ద సంచలనం.
ఎన్ని కష్టాలు పడ్డాడో...
క్రికెట్‌ను అర్ధంతరంగా వదిలేసిన హెన్లీ ఒలాంగా... తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాడు. బతకడం కోసం ఎన్నో వృత్తులను ప్రయత్నించాడు. క్రికెట్ అనంతర జీవితం ఒలాంగాకు చాలా కష్టంగా సాగింది. చాలా ఏళ్ల పాటు తండ్రిని చూసే అవకాశం రాలేదు. బతుకుతెరువు కోసం పడవలు కూడా శుభ్రం చేశాడు. సంగీతాన్ని చాలా ఇష్టపడే ఒలాంగా.. ఇదే ప్రధాన కెరీర్‌గా ఎంచుకున్నాడు. క్రూయిజ్ షిప్‌లలో వచ్చే వారి కోసం ప్రదర్శనలు ఇస్తున్నాడు. యూట్యూబ్‌లో తన సొంత సంగీత ఆల్బమ్‌లను విడుదల చేస్తున్నాడు. 2003 వన్డే ప్రపంచకప్ సందర్భంగా అప్పటి జింబాబ్వే అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే నియంతృత్వ ధోరణులపై సహచరుడు ఆండీ ఫ్లవర్‌తో కలిసి ఒలాంగా గళమెత్తాడు. ముగాబే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్లబ్యాండ్లు ధరించి ఇద్దరూ బరిలో దిగారు. ఈ నేపథ్యంలో ఒలాంగాను చంపుతామంటూ బెదిరింపులు వచ్చాయి. దీంతో దేశం వదిలి ఆస్ట్రేలియాకు వలస వెళ్లాడు. ముగాబె దిగిపోవడంతో 2017లో ఒలాంగా తిరిగి జింబాబ్వేకు వచ్చాడు. 2023లో అతడికి ఆస్ట్రేలియా పౌరసత్వం లభించడంతో ప్రస్తుతం అడిలైడ్‌లో జీవిస్తున్నాడు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com