HOCKEY: హాకీ క్రీడాకారిణిపై లైంగిక వేధింపులు

ఎఫ్ఐహెచ్ హాకీ జూనియర్ ప్రపంచకప్ మరో పది రోజుల్లో మొదలవ్వనుంది. ఈ మెగా టోర్నీ కోసం భారత బృందం చిలీకి బయల్దేరనుంది. ఈ సమయంలో సంచలన ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి. జూనియర్ హాకీ జట్టు కోచ్‌పై ఒక క్రీడాకారిణిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలసింది. ఈ విషయం తెలియడంతో కేంద్ర క్రీడా శాఖ విచారణకు ఆదేశించింది. అయితే.. ఈ సంఘటన జరిగి చాలా రోజులే అయిందని.. ఎవరూ ఫిర్యాదు చేయకపోవడంతో ఆలస్యంగా క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే..
భారత మహిళల జూనియర్ హాకీ జట్టు ఈ ఏడాది పలు విదేశీ టూర్లకు వెళ్లింది. జూన్‌లో అర్జెంటీనా, బెల్జియం, నెదర్లాండ్స్, సెప్టెంబర్‌లో ఆస్ట్రేలియాలో మ్యాచ్‌లు ఆడింది. అయితే.. ఈ సమయంలోనే ఒక ప్లేయర్ కోచ్ గదికి పలుమార్లు వెళ్లింది. ఈ విషయం స్క్వాడ్‌లోని ఇతర అమ్మాయిలకు కూడా తెలుసు. కానీ, ఎవరూ కూడా ఈ విషయాన్ని హాకీ ఇండియా లేదా కేంద్ర క్రీడా మంత్రి దృష్టికి తీసుకురాలేదు. ఎలాగోలా ఈ విషయం చివరకు కేంద్ర మంత్రి మన్సూఖ్ మాండవీయ చెవిన పడింది. దాంతో.. అతడు వెంటనే విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లైంగిక వేధింపుల నివారణ చట్టం ప్రకారం బాధితురాలు, కోచ్, ఫిర్యాదుదారు పేర్లను గోప్యంగా ఉంచనున్నారు. ఈ కేసును విచారించిన తర్వాతే నిర్ణయానికి రాగలమని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. హాకీ ఇండియా ఈ విషయం తెలియదని అంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

