Woakes : ఒంటిచెత్తో బ్యాటింగ్

ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహనం చేశాడు. వోక్స్ సాయంతో అట్కిన్సన్ జట్టు విజయం కోసం పోరాడాడు. సిరాజ్ బౌలింగ్‌లో అతను భారీ షాట్ కొట్టగా.. బౌండరీ లైన్‌పై ఆకష్ దీప్ క్యాచ్ వదిలేసాడు. దాంతో అది సిక్సర్‌గా మారింది. ఆ తర్వాతి మూడు బంతులను డాట్ అవ్వగా.. ఆఖరి బంతికి బై రూపంలో సింగిల్ వచ్చింది. దాంతో మళ్లీ అట్కిన్సన్ స్ట్రైకింగ్లోకి వచ్చాడు. ఒంటి చేత్తోనే బ్యాటింగ్ చేసేందుకు సాహనం చేశాడు. . ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ వోక్స్ భుజం విరిగినప్పటికీ ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆట చివరి రోజు ఇంగ్లండ్ గెలుపుకు 18 పరుగులు అవసరమైన దశలో వోక్స్ 11వ నంబర్ ఆటగాడిగా ఎంట్రీ ఇచ్చాడు. అతని ఎంట్రీ సినిమా ఎలివేషన్‌ను తలపించింది. వోక్స్ బ్యాటింగ్ చేయలేకపోయినా స్ట్రయిక్ రొటేట్ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించేందుకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టవశాత్తు ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ భారత్ చేతిలో 6 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.
పంత్ కూడా...
ఇదే సిరీస్ నాలుగో టెస్ట్‌లో టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ కూడా పాదం ఫ్రాక్చర్ అయినప్పటికీ జట్టు ప్రయోజనాల కోసం బరిలోకి దిగి అందరి మన్ననలు అందుకున్నాడు. 1984లో విండీస్ ఆటగాడు మాల్కమ్ మార్షల్ కూడా వోక్స్ తరహాలోనే ఒంటిచేత్తో బ్యాటింగ్‌కు దిగాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మార్షల్ ఒంటిచేత్తో బౌండరీ బాదిన సన్నివేశాన్ని క్రికెట్ ప్రపంచం ఎన్నటికీ మరిచిపోదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com