BWF World Championships 2023: పతకాన్ని ఖాయం చేసిన ప్రణయ్

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్(BWF World Championships 2023)లో భారత స్టార్ షట్లర్ H.Sప్రణయ్ అదరగొట్టాడు. సహచరులంతా క్వార్టర్స్‌లోనే ఇంటిబాట పట్టగా ప్రణయ్ మాత్రం సెమీఫైనల్‌కు దూసుకెళ్లి భారత్‌కు పతకం ఖాయం చేశాడు . హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనన్‌లో విజయంతో భారత్‌కు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం ఖాయం చేశాడు. కొపెన్ హెగెన్‌లో జరిగిన మ్యాచ్‌లో డెన్మార్క్ కి చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ విక్టర్ అక్సెల్ సెన్‌ను 13-21, 21-15, 21-16 తేడాతో ఓడించిన ప్రణయ్ సెమీస్‌లోకి దూసుకెళ్లాడు. శనివారం జరిగే సెమీస్ లో ప్రణయ్ థాయ్ లాండ్ ఆటగాడితో తలపడనున్నాడు. తనపై 7-2తో మెరుగైన రికార్డున్న అక్సెల్సన్‌తో పోరులో ప్రణయ్ తొలి గేమ్ ఓడిపోయి కూడా పుంజుకుని మ్యాచ్ గెలిచిన తీరుపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం నెగ్గి, మరోసారి పతక ఫేవరెట్లుగా టోర్నీలో అడుగు పెట్టిన సాత్విక్ సాయిరాజు-చిరాగ్ శెట్టిలకు నిరాశ తప్పలేదు. క్వార్టర్స్ చేరి పతకానికి అడుగు దూరంలో నిలిచిన ఈ జోడీకి కిమ్ ఆస్ట్రప్-ఆండర్స్ స్కారుప్ జోడీ చెక్ పెట్టింది. హోరాహోరీగా సాగిన క్వార్టర్స్ పోరులో భారత ద్వయం 18-21, 19-21తో డెన్మార్క్ జంట చేతిలో పరాజయం పాలైంది. తొలి గేమ్‌లో ఒక్కసారీ ఆధిక్యం సాధించకపోయినప్పటికీ చివర్లో ప్రత్యర్థుల స్కోరుకు చేరువగా వచ్చి గేమ్‌ను చేజార్చుకున్న సాత్విక్-చిరాగ్.. రెండో గేమ్‌లో 15-15తో స్కోరు సమం చేసి మ్యాచ్‌ను మూడో గేమ్‌కు మళ్లించేలా కనిపించింది. ఇక్కడి నుంచి ప్రతి పాయింట్ కోసం పోరాటం తీవ్ర స్థాయిలో సాగింది. కానీ ఒత్తిడిని తట్టుకుని నిలబడ్డ ప్రత్యర్థి జోడీ గేమ్‌తో పాటు మ్యాచ్‌నూ సొంతం చేసుకుంది.
ఈ టోర్నమెంట్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్, ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. తొలి రౌండ్లో ఆమెకు బై లభించడంతో నేరుగా రెండో రౌండ్లో బరిలోకి దిగిన సింధు(Former champion PV Sindhu) పరాజయం పాలైంది. ప్రతీసారి కనీసం క్వార్టర్ ఫైనలిస్ట్‌గా నిలిచిన సింధు తొలిసారి రెండో రౌండ్లోనే వెనుదిరిగింది. జపాన్‌కు చెందిన నొజోమి ఒకుహారా చేతిలో ఓడిపోయింది.
సింధు, ఒకుహర( Sindhu and Okuhara ) గతంలో ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్‌ల్లో తలపడ్డారు. కానీ ఈసారి పోరు మాత్రం అలా జరగలేదు. ప్రత్యర్థిపై 10-8 రికార్డుతో బరిలోకి దిగిన సింధు ఎటాకింగ్‌లో పదను కనపడలేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com