Eng vs Aus-Jackman: యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో వోల్వరిన్

Eng vs Aus-Jackman: యాషెస్ టెస్ట్ మ్యాచ్‌లో వోల్వరిన్
యాషెస్ సిరీస్‌లో ఏదైనా ఓ టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలన్న జాక్‌మాన్ చిన్న నాటి కల నిన్నటితో తీరింది. యాషెస్ సిరీస్‌లోని చివరి టెస్ట్ 4వ రోజున ఓవల్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాడు.

అతను సినిమాల్లో అత్యంత సుప్రసిద్ధ నటుడు. కానీ యాషెస్ టెస్ట్ మ్యాచ్‌ని కళ్లారా చూడాలన్న చిన్న నాటి ఆశయాన్ని ఇన్ని రోజులకు తీర్చుకుని ఆనందోత్సవంలో మునిగితేలాడు. ఆస్ట్రేలియాకు చెందిన ఆ హీరో సుప్రసిద్ధ హాలివుడ్ నటుడు హ్యు జాక్‌మాన్. అతని అసలు పేరు చెబితే ఆ నటుడిని గుర్తు పట్టకపోవచ్చు. కానీ ఎక్స్-మెన్(X-men) సినిమాల్లో ఉండే వోల్వరిన్(Wolverine) లేదా లోగాన్(Logan) అని చెబితే సులువుగా గుర్తుపడతారు. చేతుల నుంచి వచ్చే అత్యంత పదునైన ఆయుధాలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. అంతలా ఆ పాత్రలో ఒదిగిపోయి పాత్ర పేరునే తన మారుపేరుగా తగిలించుకున్నాడు.


అయితే క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌లో ఏదైనా ఓ టెస్ట్ మ్యాచ్ ప్రత్యక్షంగా చూడాలన్న జాక్‌మాన్ చిన్న నాటి కల నిన్నటితో తీరింది. యాషెస్ సిరీస్‌లోని చివరి టెస్ట్ 4వ రోజున ఓవల్ స్టేడియంలో ప్రత్యక్షంగా వీక్షించాడు. ఈ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రాం సోషల్ మీడియా ఖాతాలో అభిమానులతో ఆనందాన్ని పంచుకున్నాడు.

"చిన్ననాటి నా కల ఇప్పుడు నిజమైంది. ప్రత్యక్షంగా వీక్షిస్తానని ఎప్పుడూ అనుకోలేదు. కాలంలో వెనక్కి వెళ్లగలిగితే, చిన్నపటి నాకు నేను, ఈ కల నిజమవుతుంది, నమ్ము అని చెబుతాను. చాలా ఆనందంగా ఉంది" అని రాసుకొచ్చాడు

జాక్‌మాన్ ఇప్పుడు డెడ్‌పూల్ హీరో రేనాల్డ్స్‌తో కలిసి లోగాన్ పాత్రతో ఒక సినిమా చేస్తున్నాడు. దీనిపై ప్రేక్షకులకు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

4వ రోజు జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ విజయ ఆశలకు అడ్డుకట్ట వేసేలా ఆడుతోంది. నిన్న ఆట ముగిసే సమయానికి వికెట్లు కోల్పోకుండా 135 పరుగులు చేశారు. విజయానికి 249 పరుగులు మాత్రమే కావాలి.

Tags

Read MoreRead Less
Next Story