BGT: విరాట్ కోహ్లీపై మళ్లీ ఆసీస్ మీడియా విషం

టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీపై మరోసారి ఆస్ట్రేలియా మీడియా విషం చిమ్మింది. మెల్‌బోర్న్ ఎయిర్‌పోర్ట్‌లో జర్నలిస్టులతో వాగ్వాదం తర్వాత.. కోహ్లీపై కంగారు మీడియా కత్తికట్టింది. ఆసిస్ ఆటగాడు కోన్‌స్టాస్‌తో గొడవ తర్వాత కోహ్లీని 'జోకర్' అంటూ కంగారు మీడియా ఎద్దేవా చేసింది. తాజా టెస్టులో హాఫ్ సెంచరీ కొట్టిన సామ్ కొన్‌స్టాస్‌ను ప్రస్తావిస్తూ "విరాట్, నేను నీ తండ్రిని" అనే శీర్షికతో కథనం ఇచ్చింది.
ఆసిస్ మీడియాపై భగ్గుమన్న భారత క్రికెటర్
టీమిండియా స్టార్ బ్యాటర్ కింగ్ కోహ్లీపై ఆస్ట్రేలియా మీడియా చిమ్ముతున్న విషంపై భారత మాజీ ఆటగాడు మదన్ లాల్ మండిపడ్డారు. కంగారూ మీడియా ఎన్ని విమర్శలు చేసినా.. కోహ్లీ సాధించిన ఖ్యాతి ఒక్క అంగుళం కూడా తగ్గదన్నారు. ఆస్ట్రేలియా మీడియా నుంచి ఇంతకంటే తక్కువ ఆశించడం అత్యాశే అవుతుందని విమర్శించారు. కోహ్లీపై ఆస్ట్రేలియా వాడిన పదజాలం చాలా దారుణంగా ఉందని, ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు.
చెత్త షాట్ ఆడి పెవిలియన్ చేరిన కోహ్లీ
బాక్సింగ్ డే టెస్టులో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మరోసారి తక్కువ పరుగులకే అవుట్ కావడం తీవ్ర విమర్శలకు కారణమైంది. 40 బంతులు ఆడిన రోహిత్ కేవలం 9 పరుగులే చేసి పెవిలియన్ చేరగా... 29 బంతులు ఆడిన కోహ్లీ 5 పరుగులే చేసి అవుట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో ఆఫ్ సైడ్ వికెట్లకు దూరంగా వెళ్తున్న బంతిని వెంటాడి మరీ కోహ్లీ అవుట్ కావడంపై అభిమానులు భగ్గుమంటున్నారు. ఆసీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 234 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ ముందు 340 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. టీమిండియా ఓపెనర్లు రోహిత్ శర్మ, జైశ్వాల్ నిలకడగా ఆడుతున్నారు. 10 ఓవర్లు ముగిసే సరికి 17 పరగులు చేశారు. భారత విజయానికి ఇంకా 323 పరుగులు కావాల్సి ఉంది.
ఎదురీదుతున్న టీమిండియా
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా పోరాడుతోంది. రెండో ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 234 పరుగులకు ఆలౌటైంది. దీంతో టీమిండియా ముందు 340 పరుగుల లక్ష్యం నిలిచింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన భారత జట్టు 33 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్ పెవిలియన్ చేరారు. ఈ స్థితిలో భారత విజయం అంత తేలికగా కనిపించడం లేదు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com