abhishek: యువీ కోసమే ఈ ఊచకోత: అభిషేక్

ఇంగ్లాండ్‌తో ఆఖరి T20లో విధ్వంసక బ్యాటింగ్‌తో చెలరేగాడు టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ. ఏ బౌలర్లను వదలకుండా ఊచకోత కోశాడు. ఈ మ్యాచ్ తర్వాత అభిషేక్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. 'వాంఖడే ఇన్నింగ్స్ నా గురువు యువరాజ్ సింగ్‌కు అంకితం. ఈ ఊచకోత ఆయన కోసమే. ఈ ఇన్నింగ్స్‌తో ఆయన సంతోషిస్తాడని భావిస్తున్నాను. నన్ను నమ్మిన ఏకైక వ్యక్తి యువీ' అంటూ అభిషేక్ ఎమోషనల్ అయ్యాడు. తన మెంటార్ యువరాజ్ సింగ్‌తో పాటు ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ఆకాంక్షను నెరవేర్చినందుకు ప్రయత్నించినట్లు వెల్లడించాడు. స్ట్రెయిట్ డ్రైవ్‌తో సిక్స్ కొట్టడం చూసి యువరాజ్ సంతోషపడి ఉంటాడని అభిషేక్ అన్నాడు. కోచ్ గంభీర్ కూడా తాను కనీసం 15 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండాలని కోరుకుంటాడని... ఈ మ్యాచ్‌లో దానిని అమలు చేసి చూపించానని అభిషేక్ తెలిపాడు.
అభిషేక్‌కు అంబానీ స్టాండింగ్ ఒవేషన్!
ఇంగ్లండ్‌తో ఆదివారం జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఓ ఆస్తికరక సన్నివేశం జరిగింది. మ్యాచ్ చూసేందుకు స్టేడియానికి వచ్చిన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ, అభి సెంచరీ చేసిన వెంటనే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. ఆ వీడియో వైరల్ కావడంతో అభిషేక్‌ను అంబానీ ఎత్తుకుపోతాడు అంటూ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.
ఆకాశానికెత్తిన ఇంగ్లాండ్ లెజెండ్
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో T20లో అభిషేక్ శర్మ బ్యాటింగ్‌కు అంతా ఫిదా అవుతున్నారు. అతడి బ్యాటింగ్‌కు ఇంగ్లాండ్ దిగ్గజం అలిస్టర్ కుక్ ఫ్యాన్ అయ్యాడు. తాను కెరీర్ మొత్తం మీద కొట్టినన్ని సిక్సులు.. అభిషేక్ ఒక్క మ్యాచ్‌లోనే కొట్టేశాడంటూ ప్రశంసల జల్లులు కురిపించాడు. తన సుదీర్ఘ కెరీర్‌లో తాను ఇన్ని సిక్సులు బాదలేదన్నాడు. అతడు 2 గంటల్లోనే అన్ని సిక్సులు కొట్టడం అంతా షాకింగ్‌గా ఉన్నాయని మెచ్చుకున్నాడు.
సంజూ శాంసన్‌కు తీవ్ర గాయం
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ సంజూ శాంసన్‌కు తీవ్ర గాయమైనట్లు తెలుస్తోంది. ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదో T20లో సంజూ చూపుడు వేలు విరిగినట్లు సమాచారం. జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్ సంజూ గ్లోవ్స్‌కు బలంగా తాకడంతో ఆ వేలు విరిగినట్లు తెలుస్తోంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉందని, నెల రోజుల పాటు అతను ఆటకు దూరమయ్యే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది. IPL 2025 ఆరంభ మ్యాచ్‌లు కూడా ఆడకపోవచ్చు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com