నా ఇష్టం.. మళ్లీ ఇలానే చేస్తా: ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్

నా ఇష్టం.. మళ్లీ ఇలానే చేస్తా: ఆస్ట్రేలియా క్రికెటర్ మిచెల్ మార్ష్
ప్రపంచ కప్ తమ చేతుల్లోనుంచి చేజారిపోయిందన బాధ ఒకపక్క అయితే, ఎన్నో జట్లను ఓడించి ఫైనల్ కు చేరుకుని కప్పును కైవసం చేసుకున్నప్పుడు వచ్చిన ఆనందం మాటల్లో పంచుకోలేనిది.

ప్రపంచ కప్ తమ చేతుల్లోనుంచి చేజారిపోయిందన బాధ ఒకపక్క అయితే, ఎన్నో జట్లను ఓడించి ఫైనల్ కు చేరుకుని కప్పును కైవసం చేసుకున్నప్పుడు వచ్చిన ఆనందం మాటల్లో పంచుకోలేనిది. దానిని చూడగానే పడిన శ్రమ అంతా క్షణాల్లో మాయమవుతుంది. విజేతలు ఆ కప్పును చేతుల్లోకి తీసుకుని ముద్దాడి నెత్తి మీద పెట్టుకుంటారు.

దీనికోసమే కదా ఇన్నాళ్లు పోరాడింది అనే భావన వారి కళ్లలో కనిపిస్తుంది. కానీ అలా చేస్తే ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ఎందుకవుతాడు.. అందుకే గెలవడం మాకు చిటికెలో పని అని గెలిచిన కప్పు మీద తన కాళ్లు ఉంచాడు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రికెట్ ప్రియులు, భారత అభిమానులు కలత చెందారు. మిచెల్ చర్యను తప్పు పట్టారు. అతడిపై సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్లు వెల్లువెత్తాయి.

మిచెల్ మార్ష్ మొదటిసారిగా వివాదాస్పద సంఘటన గురించి మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియా ఎదురుదెబ్బ తనిని పెద్దగా బాధించలేదని, తాను చేసిన దానిలో తప్పు ఏమీ కనిపించ లేదని తనని తాను సమర్థించుకున్నాడు.

నవంబర్ 19న అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా భారత్‌ను ఓడించి ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ట్రోఫీపై తన పాదాలు ఉంచి విశ్రాంతి తీసుకున్నందుకు మిచెల్ మార్ష్ విమర్శలకు గురయ్యాడు. ఆస్ట్రేలియన్ టాప్-ఆర్డర్ బ్యాటర్ ట్రోఫీపై కాళ్లు చాచి, కుడివైపున బీర్ బాటిల్‌తో దర్జాగా సోఫాలో కూర్చున్నాడు. స్వదేశీ జట్టు ఓటమితో అప్పటికే బాధపడ్డ భారత అభిమానులను ఈ చర్య బాధించింది.

భారత పేసర్ మహ్మద్ షమీని కూడా ఈ చర్య తీవ్ర మనస్థాపానికి గురి చేసింది. ఈ ఘటనపై మార్ష్, ఆస్ట్రేలియా టీమ్ మేనేజ్‌మెంట్ ఆస్ట్రేలియా నుంచి ఎలాంటి స్పందన లేదు. "ప్రపంచంలోని అన్ని జట్లు పోరాడే ట్రోఫీ, మీరు మీ తలపై పెట్టుకోవాల్సిన ట్రోఫీ. ఆ ట్రోఫీపై కాలు ఉంచడం నన్ను చాలా బాధించింది" అని ప్రపంచ కప్‌లో ప్రముఖ వికెట్ టేకర్ షమీ అన్నారు.

క్రికెట్‌ను ఒక మతంలా అనుసరించే దేశం యొక్క మనోభావాలను దెబ్బతీసినందుకు పశ్చిమ ఆస్ట్రేలియా బ్యాటర్ దేశంలోకి ప్రవేశించడాన్ని నిషేధించాలని మనస్తాపానికి గురైన భారతీయ అభిమాని ప్రధాని మోదీని కోరారు. "భారతీయులు పవిత్రంగా భావించే వాటిపై తన పాదాలను ఉంచడం ద్వారా (భారతీయుల) మతపరమైన మరియు సాంస్కృతిక భావాలను (భారతీయుల) అగౌరవపరిచినందుకు" అతనిపై జీవితకాల నిషేధం విధించాలని కూడా అతడు కోరాడు.

మార్ష్ ఈ సంఘటన గురించి మొదటిసారి మాట్లాడుతున్నప్పుడు సోషల్ మీడియాలో తన పై చేస్తున్న వ్యాఖ్యలకు ఏ మాత్రం కలత చెందలేదు. తాను చేసిన దానిలో తప్పు ఏమీ కనిపించలేదని అన్నాడు. పైగా అవకాశం వస్తే, ఆ చర్యను పునరావృతం చేయడానికి ఏ మాత్రం సందేహించనని చెప్పాడు. “ఆ ఫోటోలో నాకు ఎటువంటి తప్పు కనిపించడంల లేదు. నేను దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. నేను సోషల్ మీడియాలో వస్తున్న వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోను. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్లు మాట్లాడతారు అని అన్నాడు.

మార్ష్ భారత్‌తో జరిగిన మూడవ T20 తర్వాత విజేతగా ఇంటికి తిరిగి వచ్చాడు. 10 ప్రపంచ కప్ మ్యాచ్‌లలో, అతను బంగ్లాదేశ్‌పై 177 నాటౌట్‌తో గెలిచిన మ్యాచ్‌తో సహా 49 సగటుతో 441 ​​పరుగులు చేశాడు.

Tags

Read MoreRead Less
Next Story