ICC: పాకిస్థాన్‌పై చర్యలకు ఐసీసీ సిద్ధం.?

ఆసియా కప్ 2025 గ్రూప్ స్టేజ్‌లో భాగంగా సెప్టెంబర్ 14 భారత్, పాకిస్థాన్ టీమ్స్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో టాస్, మ్యాచ్ అనంతరం పాక్ ఆటగాళ్లతో భారత్ ప్లేయర్స్ కరచాలనం చేయలేదు. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ నిబంధనలు ఉల్లంఘించాడని, టోర్నీ నుంచి అతడిని తొలగించాలని ఏసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. మ్యాచ్ రిఫరీని తొలగించకుంటే తాము టోర్నీని బహిష్కరిస్తామని పీసీబీ ఏసీసీని హెచ్చరించింది. ఈ విషయంపై ఐసీసీని ఏసీసీ సాయం కోరింది. మ్యాచ్ రిఫరీని తొలగించాలన్న పీసీబీ డిమాండ్‌ను ఐసీసీ సున్నితంగా తిరస్కరించింది.
బాయ్‌కాట్‌పై ఐసీసీ ఫైర్
యూఏఈతో ఆసియాకప్ మ్యాచ్ సందర్భంగా అనేక నిబంధనలు ఉల్లంఘించినందుకు పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునే అంశాన్ని ఐసీసీ పరిశీలిస్తోంది. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డుకు ఓ ఈమెయిల్ చేసింది. మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్‌ను తొలగించాలన్న తమ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించడంపై పాకిస్థాన్ నిరసనకు దిగడంతో బుధవారం యూఏఈతో మ్యాచ్ గంట ఆలస్యంగా మొదలైన సంగతి తెలిసిందే. పైక్రాఫ్ట్, పాకిస్థాన్ కోచ్ హెసన్, కెప్టెన్ సల్మాన్ అఘాల మధ్య సమావేశాన్ని ఆ జట్టు మేనేజర్ వీడియో తీయడంపై ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి సమావేశాలకు మీడియా మేనేజర్‌కు అనుమతి లేదని స్పష్టం చేసింది. పైక్రాఫ్ట్ క్షమాపణ చెప్పాడని పీసీబీ పేర్కొనడాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది. యూఏఈతో మ్యాచ్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించినందుకు పాకిస్థాన్‌పై చర్యలు తీసుకునేందుకు ఐసీసీ సిద్దమైంది. ఈ మేరకు పీసీబీకి ఓ ఈమెయిల్ చేసింది. త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. మ్యాచ్ రిఫరీ క్షమాపణ చెప్పాడని పీసీబీ చెప్పడాన్ని కూడా ఐసీసీ తప్పు పట్టింది.
వీడియో తీయడంపై ఆగ్రహం
వీడియో వైరల్ కావడంతో ఐసీసీ స్పందించింది. పైక్రాఫ్ట్ తాను తప్పు చేసినందుకు క్షమాపణలు చెప్పలేదని వివరణ ఇచ్చింది. సమాచార మార్పిడిలో లోపంపై మాత్రమే ఆయన స్పందించినట్టు పేర్కొంది. తమ అంతర్గత విచారణలో పైక్రాఫ్ట్ తప్పేమీ లేదన్న విషయం తేలిందని చెప్పింది. అయితే, పైక్రాఫ్ట్ సమావేశం తాలూకు వీడియోను రిలీజ్ చేయడం మాత్రం నిబంధనలను ఉల్లంఘించడమేనని ఐసీసీ భావిస్తోంది. ఈ అంశంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ పాక్ బోర్డుకు లేఖ రాసింది.
ఐసీసీ సీఈవో కీలక వ్యాఖ్యలు
మ్యాచ్ రోజున పదేపదే పీఎంఓఏ ఉల్లంఘనలను ఎత్తి చూపారు. అనేక హెచ్చరికలు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ వారి మీడియా మేనేజర్ నయీమ్ గిలానీని టాస్కు ముందు పైక్రాఫ్ట్, ప్రధాన కోచ్ మైక్ హెస్సన్, కెప్టెన్ సల్మాన్ అలీ అఘా మధ్య జరిగిన సమావేశాన్ని చిత్రీకరించడానికి అనుమతించింది. ఇది ICC నిబంధనల ప్రకారం కచ్చితంగా నిషేధించిన అంశం. మీడియా మేనేజర్లు అటువంటి చర్చలకు హాజరు కావడానికి అనుమతి లేదు, అలాగే పీఎంఓఏ లోపల వీడియో షూట్ చేయడం కూడా నేరమని తెలిపారు. సెప్టెంబర్ 14న జరిగిన టాస్కు సంబంధించిన మునుపటి సమస్యను పరిష్కరించడానికి, ఏవైనా అపార్థాలుంటే తొలగించే లక్ష్యంతో ICC, PCB ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అయితే PCB తమ మీడియా మేనేజర్‌ను కూడా చేర్చాలని పట్టుబట్టింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com